Lakshmi Manchu Angry About Bad Experience In Chennai Hotel : టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఓ ఈవెంట్ కోసం చెన్నైలోని ఓ హోటల్‌కు వెళ్లిన తనతో సిబ్బంది రూడ్‌గా బిహేవ్ చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోలో తన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

'నాతో దురుసుగా ప్రవర్తించారు'

చెన్నైలోని ఓ హోటల్‌లో ఎదురైన అనుభవంతో తాను పూర్తిగా నిరాశ చెందినట్లు మంచు లక్ష్మి వీడియోలో తెలిపారు. 'గ్రీన్ పార్క్ హోటల్‌లో ఎదురైన అనుభవంతో నేను నిరాశ చెందాను. నేను వరల్డ్‌లో ఎన్నో ప్రాంతాలకు వెళ్లాను. అయితే, ఎక్కడా ఇలాంటి రూల్స్ చూడలేదు. నా కెమెరా మెన్‌ను కూడా కనీసం హోటల్‌లోకి అనుమతించలేదు. ఇక్కడ హోటల్ రూంలోకి కెమెరాలు అనుమతించమని చెప్పారు. కానీ నాకు ఎక్కడా ప్రకటనలు కనిపించలేదు. ఇక్కడి మేనేజర్ ప్రవర్తన కూడా దురుసుగా ఉంది.

నేను అడిగిన ఏ ప్రశ్నకు కూడా హోటల్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు. సిబ్బంది ప్రవర్తన కూడా రూడ్‌గానే ఉంది. నేను ఇదివరకు ఇదే హోటల్‌లో దిగిన ఫోటోలు చూపించడంతో అనుమతించారు. కానీ నాకు ఇక్కడే ఇలాంటి అనుభవం ఎదురైంది. దీనిపై మేనేజ్మెంట్ స్పందించి మళ్లీ ఇలాంటివి జరగకుండా చూడాలి.' అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

Also Read : మా అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నా - సురేఖా వాణి కుమార్తె సుప్రీత కామెంట్స్ వైరల్

ప్రస్తుతం మంచు లక్ష్మి సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు. గతేడాది ఆమె నటించిన 'దక్ష' మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఓటీటీ రియాలిటీ షో 'ద ట్రైటర్స్ ఇండియా'లోనూ పాల్గొంది. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న ఆమె అప్పుడప్పుడూ హైదరాబాద్ వస్తుంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.