విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. రొమాంటిక్ ఫ్యామిలీ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 52 కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ జరుపుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఖుషి' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఎందుకంటే అటు విజయ్ దేవరకొండ ఇటు సమంత గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకొని నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగిల్చాయి.


దీంతో వీళ్లిద్దరూ కలిసి నటించిన 'ఖుషి' ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు సైతం 'ఖుషి' కలెక్షన్స్ పైనే సర్వత్ర ఆసక్తి కనబరిచాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి ఎవరూ ఊహించిన విధంగా ఓపెనింగ్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం.. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర డే వన్ 400k ప్లస్ డాలర్స్ గ్రాస్ రాబట్టి, ఈ ఏడాది అక్కడ టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాఫర్ గా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... రూ. 10 కోట్లకు పైగా షేర్ అందుకోగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 14 నుంచి రూ. 16 కోట్ల వరకు షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక గ్రాస్ వైజ్ చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.






'లైగర్'తో భారీ డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమాకి రూ.30 కోట్ల ఓపెనింగ్ రావడం అంటే మామూలు విషయం కాదు. దీన్నిబట్టి ఇది ప్యూర్ రౌడీ డామినేషన్ అని చెప్పొచ్చు. ఇక డే వన్ కలెక్షన్స్ ని బట్టి చూస్తే విజయ్ దేవరకొండకి 'ఖుషి'తో సాలిడ్ కం బ్యాక్ వచ్చినట్లే. దాదాపు అయిదేళ్లుగా భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. చివరగా నటించిన 'లైగర్' భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ని అందుకుంది. అయినా విజయ్ దేవరకొండ ఏమాత్రం బెదరకుండా 'ఖుషి' సినిమాతో డీసెంట్ హిట్ అందుకొని, మళ్లీ తానేంటో నిరూపించుకున్నాడు.


విజయ్ దేవరకొండ తో పాటు సమంత, దర్శకుడు శివా నిర్వాణ కూడా 'ఖుషి' సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళ గత సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో 'ఖుషి' రిజల్ట్ వీళ్లకు ఎంతో కీలకంగా మారింది. ఫైనల్ గా విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ.. ఈ ముగ్గురికి 'ఖుషి' సాలిడ్ కం బ్యాక్ ఇచ్చింది. వీళ్లతోపాటు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాకే అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. 'ఖుషి' సినిమా విజయంలో హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఇక 'ఖుషి' సక్సెస్ తో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి తెలుగులో వరుస అవకాశాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.


Also Read : మరణం లేని వాడికి సైతం చావు తథ్యం - కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్‘ యాక్షన్, టీజర్ చూశారా?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial