అన్వేషించండి

Ram Charan : రామ్ చరణ్ దేవాలయం - అర్జున్ థియేటర్ వద్ద చరణ్ విగ్రహంపై ట్రోలింగ్స్... సారీ చెప్పిన ఫ్యాన్స్

Peddi Celebrations : తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సంబరాలు షురూ అయ్యాయి. కూకట్పల్లి అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా దానిపై ట్రోలింగ్ సాగుతోంది.

Ram Charan Idol Mega Fans Trolled By Netizens : దేశవ్యాప్తంగా పెద్ది మేనియా నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మెగా ఫ్యాన్స్ సంబరాలు షురూ అయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, ఏలూరు నగరాల్లో థియేటర్ల వద్ద రామ్ చరణ్ భారీ కటౌట్స్‌తో సందడి చేస్తున్నారు. కూకట్పల్లిలో చరణ్ ఫ్యాన్స్ మరో అడుగు ముందుకేసి ఏకంగా ఆలయలా సెట్ వేసి చరణ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

విగ్రహంపై ట్రోలింగ్స్

కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్ వద్ద మాస్సివ్ సెలబ్రేషన్స్‌కు రెడీ అవుతూ కొణిదెల వారి ఆలయం, రామ్ చరణ్ దేవాలయం ఏర్పాట్లు చేశారు మెగా ఫ్యాన్స్. తమ అభిమాన హీరోపై అభిమానాన్ని చాటుకుంటా భారీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. పెద్దిలో చరణ్ రగ్గడ్ లుక్‌కు అనుగుణంగా విగ్రహాన్ని రెడీ చేయగా... దానికి చరణ్‌తో అస్సలు పోలికలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతోంది. దీనిపై మీమ్స్ కూడా పేలుతున్నాయి. 

ఇది రాహుల్ రామకృష్ణలా ఉందని... కాదు మలయాళ యాక్టర్ జోజు జార్జ్ విగ్రహంలా ఉందంటూ సెటైర్స్ వేస్తున్నారు. వేరే ఫోటోస్‌తో కంపేర్ చేస్తూ... ట్రోల్ చేస్తున్నారు.

సారీ చెప్పిన ఫ్యాన్స్

కూకట్పల్లి రామ్ చరణ్ ఫ్యాన్స్ క్లబ్ దీనిపై క్షమాపణలు చెప్పారు. చరణ్ గారిపై తమకున్న అభిమానం, ఇష్టాన్ని స్పెషల్‌గా చూపించాలనే విగ్రహాన్ని పెట్టామని... దురదృష్టవశాత్తు ఎగ్జిక్యూషన్ అనుకున్నట్లుగా రాలేదని తెలిపారు. ఇది మిస్ ఫైర్ అయ్యిందని... ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని... తమ ప్రయత్నం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని అన్నారు.

ఈ విగ్రహాన్ని 'ఆర్సీ యువశక్తి' ప్రెసిడెంట్ ప్రముఖ నిర్మాత పసుపులేటి శివ ఆవిష్కరించారు. ఆయన ఫ్యాన్స్‌ను సపోర్ట్ చేస్తూ... సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్‌పై రియాక్ట్ అయ్యారు. 'ఫ్యాన్స్ చేసే ప్రతీ పని వెనుక నిజమైన ప్రేమ, అభిమానం, వారి కష్టం ఉంది. ఈ ఈవెంట్‌ను కూకట్పల్లి లోకల్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. దూరం నుంచి కామెంట్ చేయడం చాలా ఈజీ. ఈ విగ్రహంపై నెగిటివ్ కామెంట్స్ చూశాను. ఫ్యాన్స్ ఎమోషన్, డెడికేషన్ మనం అర్థం చేసుకోవాలి.' అంటూ రాసుకొచ్చారు. 

Also Read : Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ

మరోవైపు, పెద్ది ప్రీ సేల్స్ రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ గ్రాస్ మార్క్ టచ్ చేసింది. ఓవర్సీస్ టోటల్ కలెక్షన్స్ రూ.35 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.11 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఏపీలో రూ.7.19 కోట్లు, తెలంగాణలో రూ.1.78 కోట్లు కలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: హనుమకొండలో పవన్ కల్యాణ్... అభిమాని చిరకాల వాంఛ నెరవేర్చిన ఏపీ డిప్యూటీ సీఎం
హనుమకొండలో పవన్ కల్యాణ్... అభిమాని చిరకాల వాంఛ నెరవేర్చిన ఏపీ డిప్యూటీ సీఎం
Vijay Deverakonda: టీజీ T20 బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ... షెడ్యూల్స్, మ్యాచ్ టికెట్ రేట్స్ నుంచి ప్రైజ్ మనీ వరకు... ఫుల్ డీటెయిల్స్
టీజీ T20 బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ... షెడ్యూల్స్, మ్యాచ్ టికెట్ రేట్స్ నుంచి ప్రైజ్ మనీ వరకు... ఫుల్ డీటెయిల్స్
Preity Mukhundhan: శర్వా సరసన ప్రీతి... కన్నప్ప హీరోయిన్‌కు తెలుగులో మరో ఛాన్స్
శర్వా సరసన ప్రీతి... కన్నప్ప హీరోయిన్‌కు తెలుగులో మరో ఛాన్స్
Pranit More: 370 బిర్యానీ ఎపిసోడ్‌లో ప్రణీత్, హిమాన్షుపై మరో కేసు... చట్టపరమైన చిక్కుల్లో కామెడీ కాంట్రవర్సీ
370 బిర్యానీ ఎపిసోడ్‌లో ప్రణీత్, హిమాన్షుపై మరో కేసు... చట్టపరమైన చిక్కుల్లో కామెడీ కాంట్రవర్సీ
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Letter to Kishan Reddy: ఎవరినీ దానం అడగటం లేదు, రావాల్సిన లోన్ నిధులు ఇప్పించండి: మెట్రో ఫేజ్2పై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ
ఎవరినీ దానం అడగటం లేదు, రావాల్సిన లోన్ నిధులు ఇప్పించండి: మెట్రో ఫేజ్2పై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ
AP Delimitation 2026: ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
Kishan Reddy: మెట్రో లోన్ ఆగిన విషయమే తెలియదు - రేవంత్ ఆరోపణలపై కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్
మెట్రో లోన్ ఆగిన విషయమే తెలియదు - రేవంత్ ఆరోపణలపై కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్
Strait of Hormuz: హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
IPL Business Update: ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
PM Modi Investment Scheme Fact Check: ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
Embed widget