సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కుబేర' (Kubera Movie). ఈ సినిమాలో ధనుష్  (Dhanush) ఫస్ట్ టైమ్ బిచ్చగాడిలా నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 'కుబేర' మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి... అటు ధనుష్, ఇటు నాగార్జున అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది మూవీ టీం.

'కుబేర' రిలీజ్ డేట్ ఫిక్స్ కోలీవుడ్ స్టార్ ధనుష్, అక్కినేని నాగార్జున కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. 2025లో మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఇది కూడా ఒకటి. మూవీ రిలీజ్ డేట్ గురించి ఇప్పటిదాకా ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ తాజాగా మేకర్స్ ఆ పుకార్లు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ధనుష్, నాగార్జున ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసి, జూన్ 20న 'కుబేర'ను థియేట్రికల్ ఎక్స్పిరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు. విడుదల తేదీ పోస్టర్‌లో నాగార్జున, ధనుష్‌లు దిగులుగా, వారి చూపుల్లో ఉన్న తీవ్రత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీంతో శేఖర్ కమ్ముల రిలీజ్ డేట్ ను కలిసి వచ్చే విధంగా ప్లాన్ చేశాడని అంటున్నారు. జూన్ 10 అంటే సమ్మర్ టైమ్ కాబట్టి, మూవీకి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు కుమ్మేయడం ఖాయమని అంటున్నారు. మహా శివరాత్రి సందర్భంగా నిర్మాతలు ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పడంతో ధనుష్, నాగ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read'మజాకా' రివ్యూ: పార్టులు పార్టులుగా చూస్తే కామెడీ సీన్లు ఓకే... మరి సినిమా? సందీప్ కిషన్, రావు రమేష్ కలిసి విసిగించారా? నవ్వించారా?

మూవీ రిలీజ్ లేట్ అంటూ పుకార్లు  ఎప్పుడో ప్రారంభం అయిన 'కుబేర' మూవీ నుంచి అప్డేట్స్ ఆలస్యం అవుతుండడంతో మూవీ రిలీజ్ అనుకున్న టైమ్ కు ఉండదని పుకార్లు వచ్చాయి. నిజానికి ఈ మూవీని 2024 డిసెంబర్ లోనే విడుదల చేస్తారు అన్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ ఉంటుందని భావించారు. కొన్ని రోజుల నుంచి జూన్ 20న 'కుబేర'ను విడుదల చేస్తారని అన్నారు. చివరకు ఇదే రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు 'కుబేరా'ను మంచి నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఈ పాన్-ఇండియన్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Read Also : 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ తరువాత మరో స్టార్ హీరోపై కన్ను... ఆ సీనియర్ హీరో కోసం శంకర్ వెయిటింగా?