క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) సినిమాల్లో పాటల్లో సాహిత్య విలువలు ఉంటాయి. డైలాగుల్లో అర్థవంతమైనవి ఉంటాయి. పాటలు, మాటల విషయంలో క్రిష్ ఎప్పుడూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. అయితే... ఇప్పుడు ఆయన స్వయంగా ఓ పాట రాశారు. 

సైలోరే... ఇది క్రిష్ రాసిన పాట!'ది' క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన సినిమా 'ఘాటి' (Ghaati Movie). ఇందులో విక్రమ్ ప్రభు హీరో. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. అనుష్క ఇంత ఇంటెన్స్ వైయలెంట్ క్యారెక్టర్ చేయడం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి జానపద గీతం 'సైలోరే' విడుదల చేశారు. 

'సైలోరే...' పాటను క్రిష్ జాగర్లమూడి స్వయంగా రాయడం విశేషం. అందులో ఆయన తన అభిరుచి చాటుకున్నారు. 'కుందేటి చుక్క' అని ఓ పద ప్రయోగం చేశారు. అంటే... 'చంద్రుడిలో ఉండే కుందేలు' అని అర్థం అన్నమాట. కథకుడిగా, దర్శకుడిగా ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న క్రిష్... గీత రచయితగా తొలి పాటతో తనదైన ముద్ర వేశారు.

అనుష్కతో విక్రమ్ ప్రభు పెళ్లి!'సైలోరే...' పాటకు నాగవెళ్లి విద్యాసాగర్ స్వరాన్ని సమకూర్చారు. సంగీత దర్శకుడిగా ఆయన మొదటి చిత్రమిది. జానపద బాణీతో పాటు మధ్యలో ర్యాప్ కూడా చక్కగా మిళితం చేశారు. లిప్సిక భాష్యం, సాగర్ నాగవెళ్లి, సోనీ కోమండూరి ఈ పాట పాడారు.రాజు సుందరం కోరియోగ్రఫీ అందించారు. 'సైలోరే...' పాటను అనుష్క, విక్రమ్ ప్రభు మీద తీశారు. వాళ్లిద్దరి పెళ్లి జరిగిన సమయంలో వచ్చే పాట అని లిరికల్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది. కొత్త జంట అనుష్క, విక్రమ్‌ ముందు జనాలు చేసే నృత్యం, సాంస్కృతిక వెలుగులతో అడవిని రంగుల విందుగా చూపించడం, మేళా తాళాలతో - భావోద్వేగాలతో పాట చిత్రీకరించడం బావుంది.

Also Readసిస్టర్ సిస్టర్ అంటూ హీరో ఛాన్స్ కొట్టేశాడు... 'ప్రేమలు' అమల్ డేవిస్‌తో మమిత సినిమా

జూలై 11న థియేటర్లలోకి 'ఘాటి'! 'ఘాటి' సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం మీద రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మిస్తున్నారు. జూలై 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

Also Readతమిళ హీరోలకు మనం హిట్స్ ఇస్తే... మనకు ఏమో తమిళ దర్శకుల నుంచి డిజాస్టర్లు!

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా నటించిన ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, నిర్మాతలు: రాజీవ్ రెడ్డి -  సాయిబాబా జాగర్లమూడి, సమర్పణ: యూవీ క్రియేషన్స్, నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఛాయాగ్రహణం: మనోజ్ రెడ్డి కాటసాని, కళా దర్శకుడు: తోట తరణి, సంగీతం: నాగవెల్లి విద్యా సాగర్, మాటలు: సాయి మాధవ్ బుర్రా, కథ: చింతకింది శ్రీనివాసరావు, కూర్పు: చాణక్య రెడ్డి తూరుపు - వెంకట్ ఎన్ స్వామి, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ క్రిషన్.