రచయితగా, దర్శకుడిగా కొరటాల శివ (Koratala Siva)ది సూపర్ సక్సెస్ ట్రాక్. ప్రతి సినిమా హిట్ అయ్యింది. మధ్యలో ఒక్క 'ఆచార్య' తప్ప. మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన 'దేవర' సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్టులో అడుగు పెట్టారు. దానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు కూడా! కానీ, ఇప్పటి వరకు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అందువల్ల, ఆయన నెక్స్ట్ సినిమా ఏది? అని అందరూ ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ నెక్స్ట్ సినిమా దేవర 2 కాదు!'దేవర' విడుదలైన తర్వాత కొరటాల శివ ఇమ్మీడియేట్ ప్రాజెక్ట్ 'దేవర 2' (Devara Part 2) అని ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆడియన్స్ భావించారు. అయితే... 'వార్ 2', ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమాలను లైనులో పెట్టారు ఎన్టీఆర్. దాంతో కొరటాల శివకు గ్యాప్ వచ్చింది. మధ్యలో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఓ సినిమా చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే... ఆ సినిమా కూడా లేదని తర్వాత తెలిసింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... చైతూతో కాదు, 'దేవర 2' కూడా కాదు. కొత్త సినిమా కొరటాల శివ చేయబోతున్నారు. అది కూడా ఆయన దర్శకత్వంలో కాదు... నిర్మాణంలో!

Also Read: Shruti Haasan: ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది

కొరటాల శివ సమర్పణలో 'మంగళవారం 2'పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మంగళవారం' గుర్తు ఉందా? ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. దానిని కొరటాల శివ సన్నిహిత మిత్రులు, యువ సుధా ఆర్ట్స్ అధినేత, 'దేవర' నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆ సినిమాకు కొరటాల సమర్పకులుగా వ్యవహరిస్తారని తెలిసింది.

Also ReadNaga Babu Konidela: 'జబర్దస్త్' రీ ఎంట్రీ... జడ్జిగా నవ్వుల నాగబాబు మళ్ళీ వచ్చారోచ్

ప్రస్తుతం అజయ్ భూపతి చేతిలో పెద్ద బాధ్యత ఉంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ కుమారుడు జయకృష్ణ ఘట్టమనేనిని హీరోగా పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' సినిమా తీస్తున్నారు. అది పూర్తి అయ్యాక 'మంగళవారం' సీక్వెల్ సెట్స్ మీదకు వెళుతుందని టాక్. మరి, 'దేవర 2'ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో? అన్నట్టు... 'మంగళవారం 2' కంటే ముందు సత్యదేవ్ 'కృష్ణమ్మ'కు కొరటాల శివ సమర్పకులుగా వ్యవహరించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

Also ReadAnanya Nagalla: విష్ణుప్రియ రూటులో అనన్య నాగళ్ళ... సబ్‌స్క్రిప్షన్ గేట్లు ఓపెన్ చేసిందోచ్