Kona Venkat About Pawan Kalyan Political Career: టాలీవుడ్ హిట్ రైటర్ కోన వెంకట్.. తనకు నచ్చని విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు. అందుకే పలు సందర్భాల్లో ఆయన ఇచ్చిన ఓపెన్ స్టేట్‌మెంట్స్.. కాంట్రవర్సీలకు కూడా దారితీశాయి. ప్రస్తుతం 2014లో ఆయన రాసిన హారర్ మూవీ ‘గీతాంజలి’కి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ తెరకెక్కింది. ఈ సీక్వెల్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు కోన వెంకట్. అదే సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


వాళ్లకే నా సపోర్ట్..


పవన్ కళ్యాణ్ రాజకీయాలను ఎంతవరకు ఇష్టపడతారు అనే ప్రశ్నకు కోన వెంకట్ ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘‘అది తను ఎంచుకున్న మార్గం. ఒక స్నేహితుడిగా ఆ మార్గంలో తను సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఇష్టపడడం, ఇష్టపడకపోవడం లాంటిది ఏముండదు. నేను చేసే చాలా పనులు కూడా మా అమ్మాయికి, నా భార్యకు.. ఇలా చాలామందికి ఇష్టముండదు. అందరికీ ఇష్టమయ్యే పని ఈ ప్రపంచంలో ఎవడు చేయలేడు’’ అని చెప్పారు కోన వెంకట్. ఇక రాజకీయాల్లో తన సపోర్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘మా ఊరు బాపట్ల. నా రాజకీయం అంతా ఆ ఊరిలోనే. పొలిమేర దాటితే రాజకీయాలతో కనెక్షన్ ఉండదు. 25 ఏళ్ల నుంచి మా నియోజకవర్గానికి మా కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తోంది. వారు ఏ పార్టీలో ఉన్నా నేను సపోర్ట్ చేస్తాను’’ అని వివరణ ఇచ్చారు కోన వెంకట్.


వాటితో సంబంధం లేదు..


తాను వైఎస్పార్సీపీకి సపోర్ట్ అని వార్తలు వస్తుండగా.. తను ఇప్పటివరకు జగన్‌ను అసలు చూడలేదు, కలవలేదు అని క్లారిటీ ఇచ్చారు కోన వెంకట్. ‘‘ఊరు దాటితే నా సినిమాలు, సిరీస్‌లు ఇంతే నా జీవితం. రాజకీయాల్లో కూడా చాలా ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. చర్చలు లాంటివి చూస్తాను’’ అంటూ రాజకీయాలకు తాను ఎంత దూరంగా ఉంటారో చెప్పుకొచ్చారు వెంకట్. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. తన దారి తనది, నా దారి నాది అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అవుతాడా లేదా అని వేణు స్వామిని అడగాలని, ఒకవేళ ఆయనను అడిగినా జగన్ గెలుస్తాడని చెప్తారని నవ్వుతూ అన్నారు కోన వెంకట్.


సున్నితమైన మనస్తత్వం..


‘‘రాజకీయాల్లో వాళ్లు మాట్లాడే భాష దారుణంగా ఉంటుంది. దానికి పవన్ కళ్యాణ్ పనికిరాడేమో అనిపిస్తుంది. అది ఆయనకు, ఆయన మనస్తత్వానికి సూట్ అవ్వదని నేరుగానే చెప్పాను. అలా అని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోవడం లేదని అన్నాడు. గత వందేళ్లలో ఏ ఆర్టిస్ట్‌కు, ఏ స్టార్‌కు రాని స్థాయి పవన్ కళ్యాణ్‌కు వచ్చింది. ఇలాంటి స్టార్‌డమ్ కోసం తపస్సు చేస్తారు. దాని నుంచి వెనక్కి వెళ్లిపోవడం ఎందుకని నా అభిప్రాయం. తను ఎప్పుడూ ఒప్పుకోలేదు. నాకు డ్యాన్స్ రాదు, యాక్టింగ్ రాదు అంటాడు. ఏం రాకుండానే పవర్ స్టార్ అయిపోయావా అంటాను. చిరంజీవి కూడా ఎవరినీ హర్ట్ చేయరు, ఆయనను ఎవరైనా ఏమైనా అన్నారని తెలిస్తే హర్ట్ అయిపోతారు. అంత సున్నితమైన మనస్తత్వం ఉన్నవారికి రాజకీయాలు సరిపోవు’’ అంటూ పవన్, చిరంజీవిపై వ్యాఖ్యలు చేశారు కోన వెంకట్.



Also Read: నీ భర్తను ఎందుకు మోసం చేశావ్‌? - నెటిజన్‌ ప్రశ్నకి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌, ఏమన్నదంటే!