Suriya : తెలుగులో రెండో మూవీకి సూర్య గ్రీన్ సిగ్నల్? - 'గీత గోవిందం' ఫేం డైరెక్టర్‌తో...
Suriya Upcoming Movies : కోలీవుడ్ స్టార్ సూర్య తెలుగులో రెండో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'గీత గోవిందం' ఫేం డైరెక్టర్‌తో ఆయన మూవీ చేయబోతున్నారట.

Kollywood Actor Suriya Movie With Director Parasuram : కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం తెలుగులో డైరెక్టర్ వెంకీ అట్లూరితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఆయనకు తెలుగులో ఫస్ట్ మూవీ. ఆయన తమిళంలో నటించిన ప్రతీ సినిమా తెలుగులోనూ రిలీజ్ కావడంతో ఇక్కడ ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో సూర్య అప్ కమింగ్ ప్రాజెక్టు కూడా మరో తెలుగు డైరెక్టర్‌తోనే చేయనున్నట్లు తెలుస్తోంది.
'గీత గోవిందం' ఫేం డైరెక్టర్‌తో
'గీత గోవిందం', 'సర్కారు వారి పాట', 'ది ఫ్యామిలీ స్టార్' వంటి మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ పరశురామ్ సూర్యతో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పరశురామ్ చెప్పిన కథకు సూర్య ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ కాంబో దాదాపు ఫిక్స్ అయినట్లే ఫిలింనగర్ వర్గాల టాక్. టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు SVC ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించబోతున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
Also Read : బాలయ్యతో కొరటాల శివ మూవీ! - పవన్ రిజెక్ట్ చేసిన స్టోరీకి ఓకే చెప్తారా?
గత కొంతకాలంగా సూర్య ఖాతాలో సరైన హిట్ పడలేదు. తాజాగా తెలుగు డెబ్యూ మూవీ బిగ్ సక్సెస్ కావాలని అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఈ మూవీకి క్లాసిక్ హిట్ తరహాలో 'విశ్వనాథన్ అండ్ సన్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా భాషలకు సరిపోయేలా ఈ టైటిల్ పెట్టాలని మేకర్స్ అనుకుంటున్నారట.
రిలీజ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య సరసన 'ప్రేమలు' ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా... భారీ బడ్జెట్‌తో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జులైలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
























