Bellamkonda Sai Sreenivas's Kishkindhapuri Movie Teaser: సూపర్ హిట్ జోడీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న లేటెస్ట్ మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. ఈ మూవీకి 'చావు కబురు చల్లగా' ఫేం కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉండగా... తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

టీజర్ గూస్ బంప్స్

గ్రిప్పింగ్ హారర్ మిస్టరీ కిష్కింధపురి టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఓ గదిలో చిన్నారి ఉండగా తలుపులు భయంకరంగా శబ్ధం చేస్తూ ఉంటాయి. వెనువెంటనే చిన్నారి మిస్ కావడం... ఆకాశవాణి వినిపించడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. 'నమస్కారం... ఈ రోజు శుక్రవారం. 9 - 8 -1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయ్. పునః ప్రసారాలు నేటితో మొదలవుతాయి.' అంటూ ఓ భయంకర వాయిస్ చెప్పడంతో టీజర్ ఆద్యంతం హైప్ క్రియేట్ చేసింది.

స్టోరీ అదేనా?

ఈ మూవీ 1989 బ్యాక్ డ్రాప్‌లో ఓ గ్రామంలో ఓ భవనం చుట్టూ సాగే హారర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అసలు ఆ గ్రామంలో 'సువర్ణమాయ' రేడియో స్టేషన్ అనే  భవనం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?, పాత కాలపు రేడియో, ఆకాశవాణి వార్తల రూపంలో వినిపించే అదృశ్య శక్తి ఎవరు? ఆ గ్రామానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమలకు ఉన్న సంబంధం ఏంటి? ఆ పాడుపడిన భవనం వద్దకు వెళ్లేందుకు గ్రామస్థులంతా ఎందుకు భయపడతున్నారు? అసలు ఆ భవనంలోకి వారు ఎలా వెళ్లారు? ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

మిస్టరీ ట్రీట్

టీజర్ చూస్తుంటే ఓ హారర్ గ్రిప్పింగ్ స్టోరీ అని అర్థమవుతుంది. ఆ పాత భవనం, వింటేజ్ లుక్, గ్రామంలో భయానక పరిస్థితులు, మనిషి సజీవ దహనం, బస్సు కాలిపోవడం అన్నింటినీ మిస్టీరియస్‌గా చూపించారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 12న హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: చలో శ్రీలంక అంటున్న రామ్ చరణ్... జాన్వీ కూడా - 'పెద్ది' కోసం ఏం ప్లాన్ చేశారంటే?

ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆడియన్స్‌ను అలరించే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్‌గా 'భైరవం'తో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు హారర్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. ఆయనకు హీరోగా ఇది 11వ మూవీ. బెల్లంకొండ, అనుపమ కాంబోలో వచ్చిన 'రాక్షసుడు' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ మూవీలో డార్క్ మిస్టీరియస్ ప్రపంచాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది.