Kiran Abbavaram Love Story: టాలీవుడ్‌లో చాలా తక్కువమంది హీరోహీరోయిన్లు ఆన్‌ స్క్రీన్ కపుల్ నుంచి ఆఫ్ స్క్రీన్ రియల్ లైఫ్ కపుల్‌గా మారారు. తాజాగా కిరణ్ అబ్బవరం, రహస్య కూడా ఆ లిస్ట్‌లోకి చేరారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య జరిగిన ఎంగేజ్‌మెంట్‌తో వీరిద్దరి ప్రేమ విషయం బయటపడింది. కానీ అంతకు ముందు వరకు కిరణ్, రహస్యల ప్రేమ గురించి పెద్దగా రూమర్స్ కూడా ఏమీ రాలేదు. దీంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరంకు తన ప్రేమ గురించే మొదటి ప్రశ్న ఎదురయ్యింది. అసలు తనకు, రహస్యకు మధ్య ప్రేమ ఎలా మొదలయ్యిందో ఈ యంగ్ హీరో బయటపెట్టాడు.


ఐదేళ్లుగా..


‘‘రాజావారు రాణీగారు సినిమా దగ్గర నుండే ఇద్దరం కనెక్ట్ అయ్యాం. నా మైండ్‌సెట్‌కు, నాకు నచ్చిన అమ్మాయి. చాలా మంచి అమ్మాయి. నాకు చాలా ఇష్టం. నేను ఎలాంటి అమ్మాయి అయితే కావాలని అనుకున్నానో అలాంటి అమ్మాయి. నేను ఎంత ఎదిగినా నాకంటూ కొన్ని మిడిల్ క్లాస్ ఆలోచనలు కొన్ని ఉంటాయి. నా ఆలోచనలకు తను బాగా సింక్ అయ్యింది. ఒకరికొకరం నచ్చాం. ఇప్పటికీ మేము రిలేషన్‌లో ఉండి దాదాపు 5 ఏళ్లు అవుతుంది. నాకు క్లోజ్‌గా ఉండేవాళ్లకు ఈ విషయం తెలుసు. కానీ నా పర్సనల్ లైఫ్ గురించి బయటికి తెలియడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఆ విషయం బయటికి రాలేదు. ఎంగేజ్‌మెంట్ కూడా చాలా సైలెంట్‌గానే చేసుకోవాలి అనుకున్నాం’’ అంటూ కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.


హంగామా నచ్చదు..


ఇక ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అని అడగగా.. ‘‘ఒకరు అని ఏం లేదు. ఇద్దరం ఇష్టపడ్డాం. రిలేషన్ మొదలయిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత ప్రపోజల్ అనేది ఒకటి ఉంటుంది కదా అని అప్పుడు చెప్పుకున్నాం. అంతకంటే ముందు ఒకరినొకరం ఎంత అర్థం చేసుకోగలం అనే ఆలోచనలోనే ఉన్నాం’’ అని అసలు విషయాన్ని బయటపెట్టాడు కిరణ్ అబ్బవరం. సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పి హంగామా చేయడం నచ్చదు కాబట్టే రహస్యతో తన ప్రేమ గురించి కూడా ఎక్కువగా ఎవరికీ తెలియదని అన్నాడు. ఒకానొక సమయంలో వరుసగా ఆఫర్లు రావడంతో కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. దాని వల్ల ట్రోలింగ్ ఎదుర్కున్నాడు. ఆ ట్రోల్స్‌పై కూడా తాను స్పందించాడు.


అది కచ్చితంగా మైనస్..


‘‘అలా వెంటవెంటనే సినిమాలు చేయడం మైనస్ అయ్యిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రేక్షకుడు ఒకే హీరోను బ్యాక్ టు బ్యాక్ చూడడానికి ఇష్టపడడేమో. రెండేళ్లకు, ఏడాదికి ఒక సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకుడిలో వచ్చే ఎగ్జైట్మెంట్.. 2,3 నెలలకు ఒక సినిమాతో వస్తే కచ్చితంగా తగ్గుతుంది’’ అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు కిరణ్. ఇక తను ఎక్కడికి వెళ్లినా తన అభిమానుల దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్‌పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. దానిపై కూడా స్పందిస్తూ.. అదంతా తాను కావాలని చేయడం లేదని, ప్రేక్షకులే స్వయంగా తనను చూడడానికి వస్తున్నారని క్లారిటీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం.



Also Read: ముందు సీత, ఆ తర్వాతే నేను - తమిళంలో కూడా ఆ మూవీ పాపులర్ - అంజలి