Actress Tabu Powerful Glimpse From King 100 Movie Release Date : టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున 100వ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తమిళ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న 'కింగ్ 100' మూవీలో టబు హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Continues below advertisement

'నిన్నే పెళ్లాడతా' మూవీతో హిట్ పెయిర్‌గా నిలిచిన ఇద్దరూ... ఆ తర్వాత 'ఆవిడా మా ఆవిడే' సినిమాలోనూ కలిసి నటించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత నాగ్, టబు కాంబో రిపీట్ అవుతుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ట్రెండ్ అవుతుండగా... తాజాగా టబు పవర్ ఫుల్ రోల్‌కు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఆ రోజున రిలీజ్ చేస్తారా?

Continues below advertisement

దసరా సందర్భంగా ఈ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్ రానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న హీరోయిన్ టబుకు సంబంధించి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్‌లో నాగ్ మాస్ లుక్‌లో అదరగొట్టారు. ఓ సాధారణ వ్యక్తి మనీ సామ్రాజ్యంలో తన ఐడెంటిటీ కోసం ఏం చేశాడు? ఎలా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు? దాని కోసం ఏం చేశాడు? అనేదే స్టోరీ అని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది.

Also Read : Vijay Deverakonda New Movie : రొమాంటిక్ కామెడీ జానర్‌లో విజయ్ దేవరకొండ - ఆ డైరెక్టర్‌తో కొత్త మూవీ ఫిక్స్

నాగ్ కెరీర్‌లో 100వ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ సరసన టబు హీరోయిన్‌గా చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్‌గా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై క్లారిటీ లేదు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా... మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ బరిలో డిసెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.