ఎస్‌జే సూర్య (SJ Suryah) వెర్సటైల్ ఫిల్మ్ మేకర్. ఆయనలో కథానాయకుడు ఉన్నాడు. అలాగే, ప్రతినాయకుడు - క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన నటుడు కాకముందు దర్శకుడు. అయితే ఇటీవల నటుడిగా బిజీ కావడంతో రైటింగ్, డైరెక్షన్ పక్కన పెట్టారు. పదేళ్ల విరామం తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టారు. ఎస్‌జే సూర్య దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా 'కిల్లర్'.
'కిల్లర్' ఫస్ట్ లుక్ రిలీజ్...ఎస్‌జే సూర్య జోడీగా ప్రీతి!ఎస్‌జే సూర్య దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'కిల్లర్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయనకు జంటగా ప్రీతి అస్రానీ నటిస్తున్నారు. ఆమెను ఎత్తుకున్న సూర్య లుక్ విడుదల చేశారు. తెలుగులో 'మళ్ళీ రావా', 'సీటీ మార్', 'ప్రెజర్ కుక్కర్' సినిమాల్లో నటించారు ప్రీతి.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాలో రాశీ ఖన్నా... ఆల్రెడీ షూటింగ్ షురూ... ఎందులోనో తెలుసా?
'కిల్లర్' పాన్ ఇండియా సినిమా. ఇందులో ఎస్‌జే సూర్య హీరోగా నటిస్తుండటం, డైరెక్షన్ చేయడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా రాశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్ (గోకులం గోపాలన్) ఎస్‌జే సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. వీసీ ప్రవీణ్, బైజు గోపాలన్ నిర్మాతలు. కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
'కిల్లర్' సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఎస్‌జే సూర్య, రెహమాన్ కాంబినేషన్‌లో ఐదో చిత్రమిది. ఇంతకు ముందు 'నాని', 'న్యూస్', 'అన్బే ఆరుయిరే', 'పులి' సినిమాలు చేశారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం... ఐదు భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.