Kiara Advani: చిన్న చిన్న విషయాలకు ఏడ్చాను... అమ్మ అయ్యాక వచ్చిన మార్పులపై కియారా అద్వానీ ఏమన్నారంటే?
Kiara Advani On Motherhood: అమ్మ అయ్యాక తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి కియారా అద్వానీ మనసు విప్పి మాట్లాడారు. ఆ సమయంలో ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ గురించి చెప్పారు.

- తల్లయ్యాక తన భావాలను అర్థం చేసుకోవడానికి ఆరు నెలలు పట్టిందని, నాతో నేను బాండింగ్ పెంచుకున్నాను.
- సిద్ధార్థ్ మల్హోత్ర షూటింగ్స్ తర్వాత వచ్చి సమయం గడిపేవారు, డ్రైవ్‌లకు తీసుకెళ్లేవారు.
- 2023లో వివాహం, 2025లో అమ్మాయి పుట్టింది, 'సరాయా' అని పేరు పెట్టారు.
Kiara Advani Mothers Day Special 2026: తల్లైన తర్వాత నటిగా తమ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్న కథానాయికలలో కియారా అద్వానీ ఒకరు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' సినిమాల్లో నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను తల్లి అయ్యాక జీవితంలో వచ్చిన మార్పుల గురించి, ప్రెగ్నెన్సీ సమయంలో & బిడ్డ పుట్టిన తర్వాత తన భర్త, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) ఇచ్చిన మద్దతు గురించి మనసు విప్పి మాట్లాడారు.
అర్థం చేసుకోవడానికి టైమ్ పట్టింది
అమ్మ అయ్యాక తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ... ''అదొక ఎమోషనల్ టైమ్. బిడ్డ జన్మించాక నా గుర్తింపు మారింది. నన్నొక అమ్మగా చూశారు. అది నిజమే... నేను అమ్మను కదా! అప్పుడు నాకు ఈ కొత్త ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. తల్లైన తర్వాత నాలో భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోవడం నాకే భారంగా అనిపించేది. నేను చాలా ఎమోషనల్ అయ్యేదాన్ని. అప్పుడు నాకు ఎంతో కష్టంగా అనిపించింది'' అని చెప్పారు.
Also Read: Sonam Kapoor Son Name - సోనమ్ కపూర్ రెండో కుమారుడి పేరుకు 'వారణాసి'తో కనెక్షన్ ఉందండోయ్
తన మనసులోని భావాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టిందని కియారా అద్వానీ తెలిపారు. ఎప్పుడూ ఇతరుల అవసరాలకు ప్రాముఖ్యత ఇచ్చేదానిని అని, అయితే అమ్మ అయ్యాక నాతో నేను బాండింగ్ పెంచుకోవడం ప్రారంభించానని, అది తన జీవితంలో వచ్చిన ఒక గొప్ప మలుపు అని కియారా చెప్పారు. ఆ సమయంలో తనకు భర్త సిద్ధార్థ్ మల్హోత్రా నుంచి ఎంతో సపోర్ట్ లభించిందని పేర్కొన్నారు.
చిన్న చిన్న విషయాలకు కూడా ఏడ్చాను
డెలివరీ టైంలో, బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత భర్త సిద్ధార్థ్ మల్హోత్రా నుంచి లభించిన మద్దతు గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ... ''ఆయన సినిమా షూటింగ్స్, ప్రమోషన్లలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ... వర్క్ అంతా పూర్తి చేసుకుని రాత్రిపూట మా ఇంటికి వచ్చి నాతో సమయం గడిపేవారు. ఆ టైంలో నేను చాలా చిన్న చిన్న విషయాలకు కూడా కన్నీళ్లు పెట్టుకునేదాన్ని. ఆ ఒత్తిడి నుంచి బయట పడటానికి డాక్టర్ సలహా మేరకు నన్ను ప్రతి రోజు రాత్రి చిన్న చిన్న డ్రైవ్‌లకు సిద్దార్థ్ తీసుకెళ్లేవారు. కారులో ఇద్దరం కాసేపు షికారుకు వెళ్లి వచ్చేవాళ్ళం. నేను సాధారణ స్థితికి రావడానికి ఆయన ఎంతో సహాయపడ్డారు. ఆ రోజులు, అప్పట్లో తన భావోద్వేగాలను తలచుకుని ఇప్పుడు మేం నవ్వుకుంటాం'' అని చెప్పారు.
Also Read: Avika Gor - బ్యాంకాక్‌కు మకాం మార్చిన టాలీవుడ్ హీరోయిన్... ఎందుకో తెలుసా?
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం ఫిబ్రవరి 2023లో జరిగింది. జూలై 2025లో ఈ దంపతులకు అమ్మాయి జన్మించింది. ఆ చిన్నారికి 'సరాయా' అని పేరు పెట్టారు. ప్రస్తుతం యష్ సరసన నటించిన 'టాక్సిక్' (Toxic)తో కియారా అద్వానీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అందులో బోల్డ్ సీన్స్ చేశారని, వాటిని డిలీట్ చేయమన్నారని టాక్. అయితే వాటిని ఆమె ఖండించారు.
Photo Gallery: Pooja Hegde In Bikini - బికినీలో బుట్టబొమ్మ... ఆ అందం చూశాక 35 ఏళ్ళు అంటే నమ్మగలమా?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















