'రాబిన్‌ హుడ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో మూవీ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ 'పుష్ప : ది రైజ్‌'లోని చార్ట్‌ బస్టర్ స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావా' పాట గురించి ఆశ్చర్యకరమైన వివరాలను పంచుకున్నారు. ఈ పాటలో సమంత కంటే ముందు కేతికా శర్మను అనుకున్నామని ఆయన వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. 

'ఊ అంటావా మావా' సాంగ్ ఛాన్స్ మిస్ 'పుష్ప 2 : ది రూల్' మూవీ గత ఏడాది రిలీజై, ఇండియన్ సినిమాలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. అయితే 'పుష్ప 2'తో పాటు ఫస్ట్ పార్ట్ 'పుష్ప : ది రైజ్' మూవీలో నటించిన ప్రధాన నటీనటులు అందరూ పాన్ ఇండియా వైడ్ గా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఈ రెండు పార్ట్స్ లోనూ ఐటం సాంగ్స్ చేసిన హీరోయిన్లు సమంత, శ్రీలీల ఇద్దరూ 'పుష్ప' ముందు తరువాత అని చెప్పుకోవాలి అనే రేంజ్ లో అభిమానగణం పెరిగింది. అయితే ఇలాంటి క్రేజ్ ను సొంతం చేసుకునే అరుదైన అవకాశాన్ని హీరోయిన్ కేతికా శర్మ చేతులారా వదిలేసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ వెల్లడించారు. 

'రాబిన్‌ హుడ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రవి శంకర్ 'పుష్ప : ది రైజ్‌'లో 'ఊ అంటావా మావా' పాటలో అదరగొట్టే ఛాన్స్ ను కేతికా శర్మ మిస్ చేసుకుందని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ "ఈ మూవీని 'అదిదా సర్ప్రైజ్' సాంగ్ తో కేతికా శర్మ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. నిజానికి 'పుష్ప' సినిమాలో ఐటం సాంగ్ కోసం సమంత కంటే ముందు కేతికానే అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల అప్పుడు మిస్ అయ్యింది. కానీ ఇన్నేళ్ల తరువాత ఆమెతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది" అని అన్నారు. దీంతో 'రాబిన్ హుడ్'లో స్పెషల్ సాంగ్ కాదు, 'పుష్ప'లో కేతిక ఐటం సాంగ్ ఛాన్స్ మిస్ చేసుకుందని తెలిపి మీరిచ్చారు షాక్... ఇదిదా సర్ప్రైజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

ట్రోలింగ్ నుంచి ట్రెండింగ్ లోకి 'అదిదా సర్ప్రైజ్' సాంగ్  2021 'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ. ఆ తరువాత నాలుగైదు సినిమాలలో నటించినా ఈ అమ్మడికి ఆశించిన క్రేజ్ దక్కలేదు. కానీ కేతికా శర్మ ఇటీవల 'రాబిన్‌ హుడ్' సినిమాలోని 'అదిదా సర్ప్రైజ్' అనే అనే స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ముందుగా ఈ సాంగ్ లోని స్టెప్స్ పై విమర్శలు విన్పించాయి. కానీ అదే ఇప్పుడు మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉండడం విశేషం. 

కాగా 'రాబిన్ హుడ్' సినిమాలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ మార్చి 28న రిలీజ్ కానుంది.