తమిళంలో 'యూత్' (Youth Movie 2026) అని ఓ సినిమా తెరకెక్కింది. తెలుగు హిట్ 'చిరునవ్వుతో'ను తమిళంలో దళపతి విజయ్ 'యూత్' పేరుతో రీమేక్ చేశారు. ఆ టైటిల్ తీసుకుని నటుడు కెన్ కరునాస్ హీరోగా నటించడంతో పాటు సినిమా చేశారు. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే... రాజకీయంగా విజయ్ మీద కెన్ తండ్రి కరునాస్ విమర్శలు చేస్తున్నారు. దాంతో సినిమా చర్చల్లో నిలిచింది.

Continues below advertisement

కెన్ కరునాస్ 'యూత్'కు ధనుష్ సపోర్ట్చెన్నైలో జరిగిన 'యూత్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ధనుష్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన హీరోగా రూపొందిన 'అసురన్', 'వాతి' సినిమాల్లో కెన్ నటించాడు. ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ధనుష్ రావడం, కెన్ గురించి మాట్లాడడంతో అక్కడ సినిమాకు మంచి బజ్ వచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కూడా హిట్ అయ్యింది. తమిళనాడులో మార్చి 19న థియేటర్లలోకి సినిమా వస్తోంది. తెలుగులో వారం తర్వాత రానుంది. 

మార్చి 26న తెలుగులో 'యూత్' విడుదలYouth Telugu Release Date: మార్చి 26న తెలుగు రాష్ట్రాలు - ఏపీ, తెలంగాణలో 'యూత్'ను విడుదల చేయనున్నారు. 'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నో ఏజ్ లిమిట్' అంటూ యువతను ఎట్రాక్ట్ చేస్తున్నారు.   

Continues below advertisement

Also Read: Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?

కెన్ కరునాస్ హీరోగా నటించిన 'యూత్'లో అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రాన్ని ఈ2సీ పతాకంపై హౌస్ ఫుల్ వినీత్, సందీప్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు.

Also ReadTrisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?

ఈ చిత్రానికి స్క్రిప్ట్ - డైరెక్షన్: కెన్ కరునాస్ & గ్యాంగ్, నిర్మాణ సంస్థ: పారవతా ఎంటర్ టైన్ మెంట్స్, నిర్మాతలు: కరుపయ్య సి. రామ్ - సులోచన కుమార్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం: వికి, కూర్పు: నాష్, కళా దర్శకుడు: రాము తంగరాజ్, కాస్ట్యూమ్ డిజైనర్: కావ్య శ్రీరామ్, క్రియేటివ్ నిర్మాత: విజయ్ ఎంపీ, స్టంట్: కలై కింగ్సన్.

Also ReadAllu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?