Keerthy Suresh Kiss Scenes: తెలుగుతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ‘మహానటి‘ సినిమాతో దేశ వ్యాప్తంగా చక్కటి పేరు తెచ్చుకుంది. విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాలో అద్భుత నటనకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అదీ అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ. సౌత్ లో అగ్ర నటిగా కొనసాగుతున్న కీర్తి, ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయిన నటిస్తుంది. గత ఏడాది ‘దసరా’ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అటు తమిళంలో ‘మామన్నన్’ మూవీతో సత్తా చాటింది. అటు ‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో నటించినా, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తమిళంలో మూడు, నాలుగు సినిమాలు చేస్తోంది.
తొలి హిందీ మూవీలోనే అందాల ప్రదర్శన, ముద్దు సన్నివేశాలు
ఇక ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్ పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు కీర్తి సురేష్. కానీ, ఈ మధ్యే బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనకు హద్దులు చెరిపేయాలని భావిస్తోందట. ముద్దు సన్నివేశాలు చేయకపోతే అక్కడ రాణించడం కష్టమని ఫీలవుతుందట. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుణ్ ధావన్‌తో కలిసి 'బేబీ జాన్’ అనే హిందీ సినిమా చేస్తోంది.
కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘తేరి’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభంలో ఎలాంటి లిప్ లాక్ సన్నివేశాలు లేవట. కానీ, దర్శకుడు ఉంటే బాగుంటుందని చెప్పారట. తొలుత నో చెప్పిన కీర్తి, ఆ తర్వాత సరే అన్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ ఏ హీరోతోనూ లిప్ లాక్ చేయలేదు. గ్లామర్ షో కూడా చేయలేదు. కానీ, ‘బేబీ జాన్’ సినిమాలో మాత్రం వరుణ్ ధావన్‌తో పెదాలు కలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, అందాల ప్రదర్శనతో కుర్రకారు మతిపోగొట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే, ఆమె అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు. ఎన్ని కోట్లిచ్చినా కీర్తి సురేష్ అలాంటి సన్నివేశాల్లో నటించదని అంటున్నారు. మరి, దీనిపై కీర్తి స్పందిస్తుందో లేదో చూడాలి.
ఆ హీరోయిన్ల బాటలో కీర్తి సురేష్
సౌత్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన చాలా మంది ఇక్కడ ఎక్స్ పోజింగ్ చేయకపోయినా, బాలీవుడ్ కు వెళ్లగానే తమ మనసు మార్చుకుంటున్నారు. ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, రష్మిక సౌత్‌లో ముద్దుగా కనిపించినా, బాలీవుడ్ ఆఫర్ రాగానే గ్లామర్ షోకు ఏమాత్రం వెనుకాడలేదు. ఇప్పుడు ఈ లిస్టులో కీర్తి సురేష్ కూడా చేరుతుందా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ఆ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఈ వార్తలే నిజమని నమ్మేయకూడదు. 'బేబీ జాన్' సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: అదంతా జస్ట్ షో, పనైపోగానే డబ్బులిస్తారు - బాలీవుడ్ తారల బండారం బయటపెట్టిన ప్రియమణి