తాను స్కూల్లో చదువుకునేటప్పుడు క్రికెట్ బాగా ఆడేదాన్ని అని, గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తనకు బాగా తెలుసు అని హీరోయిన్ కీర్తి సురేష్ తెలిపారు. ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'రివాల్వర్ రీటా'. తెలుగులో నవంబర్ 28న విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా తమిళ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ (Keerthy Suresh)కు ఓ ప్రశ్న ఎదురైంది. ''మీరు కేరళ మహిళా క్రికెట్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అది కాకుండా కేరళ క్రికెట్ లీగ్ సిరీస్‌లో ఒక జట్టుకు భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచినందుకు ఎలా ఉంది?'' అని ప్రశ్నించారు.
నేనే ఒక క్రికెట్ ప్లేయర్!
కీర్తీ సురేష్ మాట్లాడుతూ... ''మన భాతర మహిళా జట్టు కప్ గెలుచుకోవడం చాలా సంతోషంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. నేను కేంద్ర విద్యాలయ పాఠశాలలో చదివాను. 11వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో మహిళల కోసం క్రికెట్ ప్రారంభించారు. మాకు కేంద్ర విద్యాలయ పాఠశాలల మధ్య పోటీలు జరుగుతాయి. అప్పుడు నేను తిరువనంతపురంలో ఉన్నా. మాకు మధురై, కారైకుడిలో క్రికెట్ టోర్నమెంట్స్ జరిగాయి. ఆ పోటీల్లో మేము గెలిచాము. జట్టులో నేను ఓపెనింగ్ బ్యాటర్‌గా ఉన్నాను. ప్రొఫెషనల్ క్రికెటర్ కాకపోయినా క్రికెట్ నియమాలు నాకు తెలుసు. కొంచెం బాగా ఆడతాను. అందుకే క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పటి నుంచే క్రికెట్ మ్యాచ్‌లు చూడటం అలవాటు. మహిళల క్రికెట్‌లో ఏదైనా పెద్దగా ఉండాలనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈసారి భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిచింది. అది మనకు చాలా ముఖ్యమైన రోజు. సాధారణంగా నాకు ఇష్టమైన వాటిలో నేను ఎక్కువగా పెట్టుబడి పెడతాను. అదే విధంగా క్రికెట్‌లో పెట్టుబడి పెట్టాను. నేను, ప్రియన్ సార్ కలిసి పెట్టుబడి పెట్టాము. క్రికెట్ ఆటగాళ్లను కలవడం, ఆ తర్వాత వారి కథలు వినడం మరువలేను. వాళ్ల కథలు విని ఆశ్చర్యపోయాను'' అని చెప్పారు.
Also Read: 'బిగ్ బాస్ 9'కు షాక్ ఇవ్వబోతున్న స్టార్ హీరో.... హోస్ట్ చేయడం ఆపేస్తారా?
క్రికెట్ ఇంకా ఎదగాలి!
''సాధారణంగా ఆన్‌లైన్‌లో మహిళల క్రికెట్‌ను చూసే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఫైనల్ మ్యాచ్ చూసినప్పుడు పురుషుల క్రికెట్ మ్యాచ్‌లను చూసినట్లే కోట్లాది మంది చూసి ఆనందించారు. అదే విధంగా భారత జట్టు క్రీడాకారిణి జెమీమా మాట్లాడిన మాటలు నాకు చాలా నచ్చాయి. అంటే ఈ రోజు అందరూ మమ్మల్ని పొగుడుతున్నారు. కానీ ఈ మహిళల క్రికెట్ ప్రారంభించినప్పుడు మహిళా జట్టు ఏ విధమైన అంచనాలు లేకుండా ఆడింది. వారితోనే ఈరోజు మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. మేము కూడా మా భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా నడుచుకుంటామని చెప్పడం చాలా బాగుంది. క్రికెట్ మరింతగా ఎదగాలని కోరుకుంటున్నాను” అని కీర్తి సురేష్ అన్నారు.
Also Read: హీరోయిన్‌కు కోట్లు ఖరీదు చేసే కారు గిఫ్ట్... పుట్టినరోజున సర్‌ప్రైజ్ ఇచ్చింది ఎవరంటే?
రివాల్వర్ రీటా సినిమా
Revolver Rita movie release date: సురేష్ శంతురు దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన చిత్రం రివాల్వర్ రీటా. ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ మరియు ది రూట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం నవంబర్ 28న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
Also Read: 50 ఏళ్ల వయసులోనూ మహేష్ బాబు యంగ్ లుక్ వెనుక సీక్రెట్... మెరిసే చర్మం కోసం రోజూ చేసేది ఇదే