Kavya Kalyanram: ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటా... ఇంట్రెస్టింగ్‌గా కావ్య కళ్యాణ్ రామ్ కొత్త సినిమా గ్లింప్స్
Kavya Kalyanram New Movie: 'మసూద', 'బలగం'తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న తెలుగు అమ్మాయి కావ్య కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఆమె మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్నారు.

కావ్య కళ్యాణ్ రామ్... బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన తెలుగు అమ్మాయి. అప్పట్లో అగ్ర హీరోలు చాలా మందితో నటించారు. కమర్షియల్ సినిమాలు చేశారు. అయితే కథానాయిక అయ్యాక డిఫరెంట్ రూటులో వెళుతున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు ఓకే చెబుతున్నారు. 'మసూద', 'బలగం'తో మంచి విజయాలు అందుకున్నారు. ఇప్పుడీ తెలుగు అమ్మాయి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేశారు. అదే 'వాట్స్ అప్ నరేష్'.
'వాట్స్ అప్ నరేష్' గ్లింప్స్ చూశారా?
'కొత్త పోరడు' తర్వాత అన్వేష్ మైఖేల్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'వాట్స్ అప్ నరేష్'. అతనికి జోడీగా కావ్య కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. రీసెంట్‌గా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అది చూస్తే... యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ సినిమా అని అర్థం అవుతోంది.
'వాట్స్ అప్ నరేష్' చిత్రాన్ని సివివి సినిమా పతాకం మీద భాగ్యలక్ష్మీ చింత ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి సివి విశాల్ దర్శకత్వం వహించారు. ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎనభై లక్షలు కట్నం ఇస్తారని తల్లిదండ్రులు చెబితే... 'ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా' అంటూ హీరో పాత్రలో అన్వేష్ మైఖేల్ కనిపించారు. గ్లింప్స్ చూస్తే హీరోది సాఫ్ట్ వేర్ జాబ్ అని అర్థం అవుతోంది. అయితే హీరోయిన్ క్యారెక్టర్ ఏమిటి? అనేది రివీల్ చేయలేదు. గ్లింప్స్ చివర్లో 'హాయ్' అంటూ పరిచయం చేశారంతే. ఆమె లుక్ కూడా చూపించలేదు. అయితే... గ్లింప్స్ నేపథ్యంలో వినిపించిన 'లోకం తీరింతే... నువ్వే మారాలంతే! లొల్లే వద్దంటే... తెలివిని కప్పెట్టంతే' సాంగ్ బావుంది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా 'వాట్స్ అప్ నరేష్'ను తెరకెక్కిస్తున్నట్టు దర్శక నిర్మాత సీవీ విశాల్ చెప్పారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెకండ్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతోన్నామని చెప్పారు.
WHAT'S UP NARESH Cast: అన్వేష్ మైఖేల్, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న 'వాట్స్ అప్ నరేష్' సినిమాలో కె సాయి సంతోష్, ఉషశ్రీ మురళి, సంతోష్ నందివాడ, ప్రియాంక రవిరు, మధు, పద్మ, బొమ్మకంటి రవీందర్, సునందన, మాల పార్వతి, కిరణ్ కుమార్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: విప్లవ్ నైషదం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణకాంత్ మామిడాల, సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్లపల్లి- గుణ వి బాలు, ప్రొడక్షన్ డిజైన్: భరత్ చంద్ర మల్కేద్కర్, కళా దర్శకుడు: సంగెం నిఖిల్ హాసన్, కాస్ట్యూమ్ డిజైనర్: నిఖితా బచల, ఛాయాగ్రహణం: వేదరామన్ శంకరన్, సంగీతం: స్మరణ్ సాయి, నిర్మాణ సంస్థ: సివివి సినిమా, నిర్మాత: భాగ్య లక్ష్మి చింత, రచన & దర్శకత్వం: సివి విశాల్.























