ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను కలవడం అంత వీజీ కాదంటూ ఓ పెద్ద తేన తుట్టెను కదిపింది ఓ బాలీవుడ్ భామ. బన్నీని కలవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయ్ అని చెప్పింది. టోటల్ 42 కండిషన్స్ ఉన్నాయని, అందులో అల్లు అర్జున్ ముందు ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటివి ఉన్నాయని పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కావేరి బారువా అనే మహిళ. ఆ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో బన్నీ తీరు, వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో అటువంటిది ఏమీ లేదని బన్నీ టీమ్ వివరణ ఇవ్వక తప్పలేదు. ఇప్పుడీ వివాదంలో కావేరి బరువా దిగొచ్చింది.

Continues below advertisement

బన్నీకి బేషరతు క్షమాపణ...పబ్లిగ్గా సారీ చెప్పిన కావేరి బరువా!కావేరి బరువా చేసిన ఆరోపణలపై అల్లు అర్జున్ టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ అగ్ర కథానాయకుడి విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని, కావేరి మాటల్లో నిజం లేదని ఖండించింది. లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశంలో క్షమించేది లేదని పేర్కొంది. దాంతో కావేరి దిగి వచ్చింది. బన్నీకి బేషరతు క్షమాపణ చెప్పింది. 

Also ReadOTT Releases This Week: రవితేజ BMWపై సస్పెన్స్... ఓటీటీలో ఈ వారం 15 సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు - సందడి అంతా వీటిదే

Continues below advertisement

ఫిబ్రవరి 15వ తేదీన సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్)లో కావేరి బరువా ఓ పోస్ట్ చేశారు. ఆవిడను ఫాలో అయ్యేది 125 మంది కావడంతో ఎవరికీ ఆ పోస్ట్ చేరలేదు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కావేరి బరువా సారీ పోస్ట్ వైరల్ అవుతోంది. తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని, ఆ మాటలకు అసలు ఎటువంటి ఆధారాలు లేవని కావేరి తెలిపారు. అల్లు అర్జున్ మీద అబాండాలు వేసినందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. అదీ సంగతి!

Also ReadTheatrical Releases This Week: తెలుగులో సుహాస్ & శివ కందుకూరికి... హిందీలో మృణాల్ & తాప్సీకి కాంపిటీషన్ లేదుగా... థియేటర్లలో ఈ వారం రిలీజయ్యే సినిమాల లిస్ట్

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే... ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్ 'పుష్ప 2 ది రైజ్' తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్న మరి కొంత మంది దర్శకులు లైనులో ఉన్నారు.

Also Read: Danny First Look: ఇదెక్కడి ఫస్ట్ లుక్ మావా... పారాణితో ఆ సిగరెట్ వెలిగించడం ఏమిటి? శోభనం రోజు అదేమిటి?