Karuppu Release: థియేటర్లలోకి 'వీరభద్రుడు'... సూర్య 'కరుప్పు' విడుదలకు లైన్ క్లియర్
Karuppu Release Today: సూర్య 'కరుప్పు' విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇవాళ్టి నుంచి థియేటర్లలో సినిమా సందడి చేయనుంది. తమిళనాడుతో పాటు తెలుగులో సినిమా విడుదల అవుతోంది.

Suriya Karuppu Release Update: సూర్య సినిమాకు అడ్డంకులు తొలగాయి. ఆయన అభిమానులతో పాటు నిర్మాతలను టెన్షన్ పెట్టిన 'కరుప్పు' విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - ఇంకా ప్రపంచవ్యాప్తంగా మే 15వ తేదీ... అంటే ఇవాళ్టి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.
మాతో ఉన్నందుకు థాంక్స్ - సూర్య
''డియర్ ఆల్... మాతో ఉన్నందుకు థాంక్యూ. ఈ రోజు నుంచి 'కరుప్పు', 'వీరభద్రుడు' థియేటర్లలో విడుదల అవుతోంది'' అని సూర్య ట్వీట్ చేశారు.
Dear all…
— Suriya Sivakumar (@Suriya_offl) May 15, 2026
Thank you for being with us! 🙏🏽#Karuppu #VeeraBhadrudu from today!@RJ_Balaji @trishtrashers @dop_gkvishnu @SaiAbhyankkar @prabhu_sr @DreamWarriorpic @thinkmusicindia pic.twitter.com/iXxw5V8FiH
ప్రేక్షకులకు చిత్ర నిర్మాణ సంస్థ సారీ!
మే 14వ తేదీన విడుదల కావాల్సిన 'కరుప్పు' / 'వీరభద్రుడు' విడుదల ఒక్క రోజు ఆలస్యం కావడం... చివరి నిమిషంలో విడుదల క్యాన్సిల్ కావడంపై సూర్య ఫ్యాన్స్, అలాగే ప్రేక్షకులకు చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ క్షమాపణలు తెలిపింది.
''కొన్ని ప్రయాణాలు కాలాన్ని మాత్రమే కాదు... హృదయాన్ని కూడా పరీక్షిస్తాయి. 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు') విడుదల కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరికీ, సినిమా గురించి అడుగుతూ ఉన్న ప్రతి ఒక్కరికీ, మౌనం & విడుదలలో జాప్యం మధ్య కూడా మమ్మల్ని నమ్మడం ఆపని ప్రతి ఒక్కరికీ మేము క్షమాపణలు చెబుతున్నాం. అన్నింటి కంటే ముఖ్యంగా థాంక్స్'' అని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ట్వీట్ చేసింది.
''సినిమా విడుదల కోసం చేసిన ఈ నిరీక్షణ బాధాకరమైనదని మాకు తెలుసు... మీలో (అభిమానులు, ప్రేక్షకులు) చాలా మంది ఈ సినిమాను ఎంతో ప్రేమించారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని మాకు తెలుసు. విడుదలలో ఆలస్యం మమ్మల్ని కూడా ఎంతో బాధించింది. కొన్ని గంటలుగా మాకు ఎదురైన దెబ్బల్లోనూ మీకు మాకు ఇచ్చిన మద్దతు, మాపై మీరు ఉంచిన నమ్మకం, మీ విశ్వాసం, మీ అంతులేని ప్రేమే ఈ కలను సజీవంగా ఉంచాయి'' అని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవుతోందని పేర్కొంది. థియేటర్లలో కలుద్దామని స్పష్టం చేసింది. 'కరుప్పు' తమ కథ మాత్రమే కాదని, ప్రేక్షకుల అందరి కథ అని... నిద్రలేని రాత్రులు, పోరాటాల మధ్య సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నామని తెలిపింది.
There are some journeys that test not just time, but the heart itself.
— DreamWarriorPictures (@DreamWarriorpic) May 14, 2026
To every person who waited for Karuppu who kept asking about the film, who never stopped believing in us even through the silence and delays — we owe you an apology, and more importantly, our deepest…
సూర్య సరసన త్రిష నటించిన 'కరుప్పు' సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. తమిళనాడులో ఉదయం తొమ్మిది గంటల ఆటలు, తెలుగులో ఉదయం 10 గంటల తర్వాత ఆటలతో సినిమా విడుదల అవుతోంది. తమిళ, తెలుగు రాష్ట్రాల్లో గురువారం విడుదల ఆగినప్పటికీ... ముంబై, పుణెలోని కొన్ని థియేటర్లలో సినిమాను ప్రదర్శించడంపై నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా పైరసీకి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఇప్పుడీ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















