తమిళ చిత్రసీమలో శివకుమార్ తనయుడిగా సూర్య (Suriya Sivakumar) అడుగు పెట్టినప్పటికీ... కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ తర్వాత తరంలో విజయ్, అజిత్ వంటి స్టార్స్ సరసన చేరారు. ఆయనకు 2000 నుంచి 2014 మధ్య కాలంలో వరుసగా విజయాలు వచ్చాయి. సక్సెస్ స్ట్రీక్ మైంటైన్ చేశారు. కానీ, ఆయన గత కొన్ని ఏళ్లుగా సరైన విజయాలు లేక సతమతం అవుతున్నారు. ఇప్పుడు 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు')తో అయినా సక్సెస్ కొడతారా? బ్లాక్ బస్టర్ కొట్టి తన స్టార్‌డమ్ తిరిగి పొందుతారా? అనేది చూడాలి.  

Continues below advertisement

సింగమ్ తర్వాత సూర్యకు సరైన హిట్ ఎక్కడ?తమిళంలో సూర్య స్టార్ హీరో. అయితే... ఆయనకు 'గజినీ' తెలుగులో స్టార్ డమ్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. 'సింగం' సిరీస్ అయితే తెలుగు, తమిళ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 'సింగమ్ 3' తర్వాత సూర్యకు సరైన విజయం రాలేదు.

ఓటీటీలకు వెళ్ళిన రెండు సూర్య హిట్ సినిమాలు!'సింగమ్ 3' తర్వాత సూర్య అసలు సరైన సినిమా చేయలేదా? అంటే చేశారు. కానీ, ఆ రెండు సినిమాలు ఓటీటీల్లోకి వెళ్ళాయి. 'ఆకాశమే నీ హద్దురా' (తమిళంలో 'సూరరై పొట్రు'), 'జై భీమ్' మంచి సినిమాలే. కరోనా వల్ల థియేటర్లు బంద్ అవ్వడంతో ఆ రెండూ ఓటీటీల్లోకి వచ్చాయి. ఒకవేళ థియేటర్లలోకి వచ్చి ఉంటే భారీ విజయాలు సాధించేవి. దాంతో సూర్య రెండు థియేట్రికల్ హిట్స్ మిస్ అయ్యారు. 

Continues below advertisement

రోలెక్స్ చూపించిన ఇంపాక్ట్ హీరోగా చూపించలేదు!'సింగమ్ 3' సినిమా 2017లో విడుదలైంది. ఆ తర్వాత సూర్య హీరోగా నటించిన ఆరు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన 'కంగువ' డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన 'రెట్రో' కూడా అంతే. ఆ రెండిటితో సూర్య ప్రయోగాలు చేశారని అనుకున్నా... అంతకు ముందు 'గ్యాంగ్', 'ఎన్.జి.కే' సినిమాలు ఫ్లాపే.

Also Read: కమల్‌ వల్ల కాలేదు... రజనీ రాలేదు... 60 ఏళ్ళ ద్రావిడ ప్రభుత్వాలను విజయ్ ఎలా ఓడించాడు? సక్సెస్ ఫార్ములా ఏంటి?

లోక నాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలో ఆయన అతిథి పాత్ర రోలెక్స్ చేశారు. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. హీరోగా చేసిన క్యారెక్టర్లు ఏవీ ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించలేదు. దాంతో సూర్య థియేట్రికల్ మార్కెట్ కూడా కొంత పడింది. మరి, ఇప్పుడు 'వీరభద్రుడు'తో హిట్ కొడతారా? లేదా? అనేది చూడాలి.

సుమారు 20 ఏళ్ళ తర్వాత సూర్యతో త్రిష ఫిల్మ్!ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన 'కరుప్పు' (తెలుగు 'వీరభద్రుడు')ను ఫ్యాన్స్ కోసం చేసినట్టు సూర్య చెబుతున్నారు. ఇందులో ఆయన న్యాయవాది శరవణన్ పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రకు మరొక పేరు 'కరుప్పు'. గ్రామ దైవం, న్యాయ రక్షకుడు కరుప్పుస్వామి స్ఫూర్తితో రూపొందించారు. ఈ సినిమా సూర్య మాస్ ఇమేజ్‌, స్టార్‌డమ్‌ను సెలబ్రేట్ చేసేలా ఉంటుందని అభిమానులకు దర్శకుడు భరోసా ఇచ్చారు.

Also Read: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి

'వీరభద్రుడు'లో సుమారు 20 ఏళ్ల తర్వాత త్రిష, సూర్య మళ్ళీ జంటగా నటించారు.  మరి, ఈ మాస్ ఎంటర్‌టైనర్... సామాజిక సందేశంతో కూడిన సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. 'విక్రమ్'తో కమల్ హాసన్, 'జైలర్'తో రజనీకాంత్ ఎలా కమ్ బ్యాక్ ఇచ్చారో... సూర్య కూడా బాక్సాఫీస్ బరిలో అటువంటి కమ్ బ్యాక్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.

Suriya Upcoming Movies: 'వీరభద్రుడు' తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాథన్ అండ్ సన్స్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మలయాళ దర్శకుడు మరియు జిత్తు మాధవన్‌తో మరొక సినిమా అంగీకరించారు. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Also ReadSA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?