కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ'. క్రిస్మస్ బరిలో విడుదల అయ్యింది. ఈ సినిమాపై హీరో హీరోయిన్లు చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ... బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఘోర పరాజయం పాలైంది. 'ధురంధర్' దెబ్బకు థియేటర్ల నుంచి ఎగిరిపోయింది. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Continues below advertisement

కార్తీక్ ఆర్యన్ అంటే యూత్‌లో మంచి క్రేజ్ ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతాయి. కానీ ఈ చిత్రం భారత దేశంలో కేవలం 32.95 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఇప్పుడు సినిమా డిజాస్టర్ కావడం, బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడకపోవడంతో హీరో కార్తీక్ ఆర్యన్ తన ఫీజును తగ్గించుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

రెమ్యూనరేషన్ తగ్గించుకున్న కార్తీక్ ఆర్యన్'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' చిత్ర నిర్మాత కరణ్ జోహార్ - కార్తీక్ ఆర్యన్ మధ్య విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలకుచెక్ పెడుతూ... హిందీ చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతకు కార్తీక్ ఆర్యన్ మద్దతు ఇచ్చాడని చర్చ జరుగుతోంది. బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం... సినిమా విడుదలైన వెంటనే ఈ సినిమా కోసం కార్తీక్ ఆర్యన్ తన రెమ్యూనరేషన్ నుంచి 15 కోట్ల రూపాయలను స్వచ్ఛందంగా తగ్గించుకున్నాడట. నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ - కరణ్ జోహార్ కోసం ఆ నిర్ణయం తీసుకున్నాడట. కార్తీక్ ఆర్యన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ చర్చించుకుంటున్నారు.

Continues below advertisement

Also Read: రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా... 'తూ మేరీ మై తేరా మై తూ మేరీ' టోటల్ కలెక్షన్స్‌ తెలుసా?

'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ... కార్తీక్ ఆర్యన్ చేసిన పని ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంతకు ముందు కార్తీక్ ఆర్యన్ నటించిన 'షెహజాదా' సినిమా సైతం అనుకున్నంతగా ఆడలేదు. అప్పుడు కూడా ఈ హీరో నిర్మాతలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి తన ఫీజులో ఎక్కువ భాగాన్ని వదులుకున్నాడు. కార్తీక్ ఆర్యన్ రాబోయే సినిమాల గురించి మాట్లాడితే... ప్రస్తుతం 'నాగ్‌జిలా' షూటింగ్ చేస్తున్నాడు. దానికి కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read: SlumDog 33 Temple Road: పూరి - సేతుపతి సినిమాకు 'స్లమ్‌డాగ్' టైటిల్ ఫిక్స్... ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారోచ్