Karthi's Sardar 2 Release Date Officially Announced : కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. చాలా రోజుల క్రితం సర్దార్ 2 నుంచి కార్తి ఫస్ట్ లుక్‌తో పాటు ప్రొలాగ్ వీడియోను అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అంటూ ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.

Continues below advertisement

రిలీజ్ ఎప్పుడంటే?

'సర్దార్ 2' మూవీని వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 10న రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గతేడాది జూన్‌లో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగా... ఎట్టకేలకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ భారీ హిట్ కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Continues below advertisement

ఈ మూవీలో కూడా కార్తి సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఫస్ట్ పార్ట్ ముగిసిన దగ్గర నుంచీ సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. బ్లాక్ డాగర్ పాత్రలో ఎస్‌జే సూర్య కనిపించనున్నారు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తుండగా... యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : Veerabhadruni Rahasyam Series OTT : ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' - 90s సెన్సేషన్ మర్మదేశం సీక్వెల్‌... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

స్టోరీ ఏంటంటే?

ఫస్ట్ పార్ట్‌లో దేశద్రోహిగా ముద్రపడిని ఏజెంట్ సర్దార్ చంద్రబోస్, ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ కలిసి ఓ మిషన్ కంప్లీట్ చేయడంతో కథ ముగుస్తుంది. ఇక సెకండ్ పార్ట్‌లోనూ సీక్రెట్ ఏజెంట్‌గానే కార్తి కనిపించనున్నారు. సర్దార్‌పై దాడి చేసేందుకు కొందరు యత్నించగా... వారు చెప్పే హింట్ ఆధారంగా దేశం ప్రమాదంలో ఉందని తెలుసుకుంటాడు. దేశంలో ప్రళయం సృష్టించేందుకు బ్లాక్ డాగర్ ఎంట్రీ ఇవ్వనుండగా... అతన్ని సర్దార్ ఎలా అడ్డుకున్నాడు? సీక్రెట్ ఏజెంట్‌గా ఆ రహస్యాలను ఎలా కనిపెట్టాడు? అనేదే స్టోరీ.

Also Read : Sangeeth Sobhan : సంగీత్ శోభన్‌తో 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రొడ్యూసర్ - డైరెక్టర్ ఎవరో తెలుసా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.