By: ABP Desam | Updated at : 16 May 2023 11:49 AM (IST)
రాధికా కుమారస్వామి (Image Courtesy : Radhika_kumarswamy / Instagram)
కర్ణాటక రాజకీయాల్లో (Karnataka Politics) ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? అని ఇప్పుడు దేశం అంతా ఓ కన్నేసి ఉంచింది. కన్నడనాట తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టేది ఎవరు? అని ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో రాజకీయాలపై కర్ణాటక మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి మాజీ భార్య రాధిక (Radhika Kumaraswamy) కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలపై ఆసక్తి లేదు - రాధికా కుమారస్వామి
రాధికకు, తనకు సంబంధం లేదని కుమారస్వామి కొన్ని రోజుల క్రితం స్పష్టం చేశారు. ఆమెతో కొన్నాళ్ళు కలిసి ఉన్నట్లు మాత్రమే ఆయన పేర్కొన్నారు. అది పక్కన పెడితే... తాను, కుమారస్వామి పెళ్లి చేసుకున్నట్లు, తమకు ఓ కుమార్తె కూడా ఉన్నట్లు రాధికా కుమారస్వామి తెలిపారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని శాండిల్ వుడ్ టాక్.
కుమారస్వామికి, ఆమెకు ఉన్న సంబంధం దృష్ట్యా... ''రాజకీయాలపై మీకు ఆసక్తి ఉందా?'' అనే ప్రశ్న రాధికకు ఎదురు కావడం సహజమే! 'అజాగ్రత్త' సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆమెకు ఆ ప్రశ్న ఎదురైంది. ''వివిధ రాజకీయ పార్టీలు నన్ను సంప్రదించాయి. తమ పార్టీలో చేరమని అడిగాయి. అయితే... నాకు రాజకీయాలపై ఆసక్తి లేదని వాళ్ళకు స్పష్టంగా చెప్పేశా. నాకు సినిమాలు అంటే ఇష్టం. రాజకీయాలు నాకు సరిపడవు'' అని రాధికా కుమారస్వామి పేర్కొన్నారు.
ఏడు భాషల్లో తెరకెక్కిస్తున్న 'అజాగ్రత్త' సినిమాతో సుమారు పదేళ్ళ తర్వాత రాధికా కుమారస్వామి తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె సోదరుడు రవి రాజ్ ఆ సినిమా నిర్మాత. నిజం చెప్పాలంటే... తొలుత ఆ సినిమాలో కథానాయికగా తనను అనుకోలేదని, ఎవరూ సెట్ కాకపోవడం కథ విన్నాక విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పానని ఆమె తెలిపారు.
Also Read : గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?
తెలుగు తెరకు 'అజాగ్రత్త'తో శ్రేయాస్!
'అజాగ్రత్త' సినిమాతో శ్రేయాస్ తల్పాడే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. హిందీలో రోహిత్ శెట్టి సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులకు శ్రేయాస్ తల్పాడే (Shreyas Talpade) పరిచయమే. 'గోల్ మాల్' ఫ్రాంచైజీలో లక్ష్మణ్ పాత్ర ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'ఓం శాంతి ఓం' సహా పలు హిట్ సినిమాల్లో శ్రేయాస్ నటించారు. 'పుష్ప', 'పుష్ప 2'లో అల్లు అర్జున్ పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పారు. 'అజాగ్రత్త' చిత్రానికి ఎం శశిధర్ దర్శకుడు.హైదరాబాదులో గత శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు వివరించారు.
త్వరలో తెలుగు నేర్చుకుంటా! - శ్రేయాస్ తల్పాడే
సినిమా ప్రారంభోత్సవంలో శ్రేయాస్ తల్పడే మాట్లాడుతూ... ''మీ అందరికీ నమస్కారం. 'అజాగ్రత్త' టీంకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రస్తుతానికి ఈ రెండు పదాలే నేర్చుకున్నా. త్వరలో తెలుగు నేర్చుకుంటా'' అని చెప్పారు. రావు రమేష్, సునీల్, ఆదిత్య మీనన్, రాఘవేంద్ర శ్రవణ్, జయ్ ప్రకాష్, వినయ ప్రసాద్, దేవ్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ : రవి వర్మ, సహ నిర్మాత : యాదవ్, ఛాయాగ్రహణం : సందీప్ వల్లూరి, సంగీతం : శ్రీహరి.
Also Read : మహేష్, త్రివిక్రమ్ టైటిల్ రేసులో కొత్త పేరు - 'ఊరికి మొనగాడు'?
Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్
Bhola Mania Song Promo : భోళా శంకరుడి మేనియా షురూ - ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత
NTR Centenary Awards : 'వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ రికార్డ్స్'లో ఎఫ్‌టిపిసి ఎన్టీఆర్ అవార్డ్స్
Varun tej: పెళ్లి వార్తలు పట్టించుకోకుండా పిజ్జా తింటున్నావా? వరుణ్ బ్రో! - లావణ్య కూడా అక్కడే?
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !