ఫుట్ బాల్ ప్లేయర్‌గా అరవింద్ కృష్ణ (Aravind Krishna)కి ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. అటు క్రీడాకారుడిగా, ఇటు సినీ హీరోగా అరవింద్ కృష్ణ ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాంటి అరవింద్ కృష్ణకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. ఆయన ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలను చేస్తున్నాడు. అందులో భాగంగా ఏ మాస్టర్ పీస్ అని సూపర్ హీరో పాత్రను పోషిస్తున్నాడు. మరో వైపు ‘కర్మస్థలం’ అనే ఓ పీరియాడిక్ డ్రామాలోనూ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

రాయ్ ఫిల్మ్స్ సమర్పణలో అరవింద్ కృష్ణ హీరోగా రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. ఈ మూవీని హర్షవర్దన్ షిండే నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సాయి కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్ కృష్ణ పాత్రకు సంబంధించిన లుక్‌ను  విడుదల చేశారు.

Also Read: LIK Box Office Collection Day 2: ఫ్లాప్ టాక్‌తోనూ ప్రదీప్ రంగనాథన్ సినిమాకు వసూళ్లు... రెండో రోజు ‘లైక్’కి ఎంత వచ్చిందంటే?

ఓ యోధుడిలా ‘కర్మస్థలం’లో అరవింద్ కృష్ణ కనిపించబోతోన్నారు. పోస్టర్‌లో ఆయన్ను చూపించిన తీరు, గెటప్, లుక్స్, చేతిలో పట్టుకున్న ఆ మాయాదండం ఇలా అన్నీ కూడా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్, బీజీఎం అదనపు ఆకర్షణ అయ్యేలా ఉంది. ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, చుంకీ పాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్, బలగం సంజయ్,దిల్ రమేష్, నాగ మహేష్,వినోద్ అల్వ, మిథాలీ చౌహన్,కిల్లి క్రాంతి, వెంకటేష్ ముమ్మిడి తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also ReadDacoit box office collection day 2: రెండవ రోజు పెరిగిన కలెక్షన్స్... బాక్సాఫీస్ వద్ద నిలకడగా ‘డెకాయిట్’ - ఎన్ని కోట్లు వచ్చాయంటే?

ఇప్పటికే బిగ్ బాస్ దివి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఇతర పాత్రలకు సంబంధించిన అప్డేట్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రానున్నాయి. ఈ సినిమా అద్భుతమైన విజువల్ వండర్‌గా ఉంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

Also ReadUstaad Bhagat Singh OTT: ఈ వారమే ఓటీటీలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'... స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ తెల్సా?