Actress Rukmini Vasanth Reaction On National Crush Tag: నేషనల్ క్రష్... ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చేది స్టార్ హీరోయిన్ రష్మిక 'మందన్న. ఈ ఏడాది 'పుష్ప 2' నుంచి మొన్నటి 'కుబేర' వరకూ వరుస హిట్లతో ఆమె దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే, రీసెంట్‌గా సోషల్ మీడియాలో 'నేషనల్ క్రష్' ట్యాగ్ అంటే వేరే హీరోయిన్‌ పేరు కూడా వినిపిస్తోంది. కొందరు ఆమెనే నిజమైన నేషనల్ క్రష్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఆ కన్నడ బ్యూటీ

కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కూడా 'నేషనల్ క్రష్' సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బాక్సాఫీస్ లేటెస్ట్‌ బ్లాక్ బస్టర్ 'కాంతార చాప్టర్ 1'లో 'కనకవతి'గా ఆమె అందం, అభినయం, నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. యువరాణిగా గాంభీర్యం చూపిస్తూనే... తన రోల్‌లో ఊహించని మలుపులతో క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్టులతో రుక్మిణీ వసంత్ యాక్టింగ్ వేరే లెవల్. ఈ మూవీతో ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమెనే కొత్త 'నేషనల్ క్రష్' అంటూ ప్రకటించారు. అయితే ఈ ట్యాగ్‌పై హీరోయిన్ తాజాగా రియాక్ట్ అయ్యారు.

Also Read: 'బకాసుర రెస్టారెంట్'పై బాలీవుడ్ హీరో ఇంట్రెస్ట్! - రీమేక్ చేస్తారా?... ఓటీటీలో దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్

దాని గురించి ఆలోచించను

చాలా మంది తనను 'నేషనల్ క్రష్' అంటున్నారని... దాని గురించి తాను ఆలోచించనని చెప్పారు రుక్మిిణి. 'నన్ను చాలా మంది నేషనల్ క్రష్ అంటున్నారు. అది బాగుంది. కానీ నేను వాటి గురించి ఆలోచించను. పొగడ్తలు తాత్కాలికం. అవి కాలంతో పాటు మారతాయి.' అంటూ చెప్పారు.

రుక్మిణీ వసంత్ కన్నడతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. కన్నడ మూవీ 'బీర్బల్ త్రయం'తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'అప్పుడో ఇప్పుడు ఎప్పుడో' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అయినప్పటికీ 'సప్త సాగరాలు దాటి' మూవీ తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక రీసెంట్‌గా శివకార్తికేయన్ 'మదరాసి' మూవీలోనూ హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న 'డ్రాగన్' మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తున్నారు. కన్నడ స్టార్ యష్ 'టాక్సిక్'లోనూ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.