Kangana Comments on Aishwarya Rai: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఎవరిని టార్గెట్‌ చేస్తుందో తెలియదు. ఎప్పుడూ నెపోటిజం(బంధుప్రీతి) అంశాన్ని తెరపైకి తెస్తూ స్టార్‌ కిడ్స్‌, డైరెక్టర్స్‌ని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. ముఖ్యంగా కరణ్‌ జోహార్‌పై ఎప్పుడు ముక్కువిరిచే కంగనా సామాజిక అంశాలపై కూడా తన గొంతు వినిపిస్తుంది. ఈ క్రమంలో ఎదుటివారు ఎంతటి వారైనా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా బయటపెడుతుంది. అలా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే కంగనా ఎవరినీ పొగిడినా అది చర్చనీయాంశం అవుతుంది. సహజంగా ఆమెపై ఎవరిని ప్రశంసించదు. అలా చేసిందంటే మాత్రం ఎదుటి వ్యక్తి ఎంతటి గొప్పవారైతే కానీ పొగడదు.


అలాంటి కంగనా తాజాగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌పై ఊహించని కామెంట్స్‌ చేసింది. ఎప్పుడు స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై విరుచుకుపడే ఆమె ప్రత్యేకంగా ఐశ్వర్యరాయ్‌ని ఉద్దేశించి పోస్ట్‌ చేయడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇటీవల కంగనా.. ఐశ్వర్యరాయ్‌ నటించిన 'హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌' మూవీలోని ఓ క్లిప్‌ను షేర్‌ చేసింది. దీనికి "డివైన్‌ బ్యూటీ" అంటూ ఐశ్వర్య అందాన్ని పొగిడింది. ఇది చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ప్రత్యేకంగా కంగనా ఐష్‌ని ప్రశంసించడం కొత్త ఉందంటూ తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. 


Also Read: 'ఊరు పేరు భైరవకోన' ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే? - స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే.!


ఇదిలా ఉంటే కంగనా, ఐశ్వర్యలు ఇండస్ట్రీలో మంచి సన్నిహితులని, వారిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఐష్‌ అందానికి ప్రపంచమే ఫిదా అయ్యింది. ఇప్పటికీ ఐశ్వర్యను ప్రపంచ సుందరి అంటూ పిలుచుకుంటారు. ఇక కంగనా షేర్‌ ఈ మూవీలో ఐశ్వర్య తన యాక్టింగ్‌ స్కిల్‌, అందంతో ఆకట్టుకుంటుంది. సంజయ్‌ లీలా భన్సాలీ మల్టీస్టారర్‌గా 'హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌' తెరకెక్కించారు. ఇందులో షుఆరు్‌ ఖాన్‌, అజయ్‌ దేవగన్‌లు హీరోలు కాగా ఐశ్యర్య హీరోయిన్‌గా నటించింది. 1999లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేసి మంచి కమర్షియల్‌ హిట్‌ సాధించింది. అంతేకాదు ఆ ఏడాదిలో బిగ్గెస్ట్‌, హయ్యేస్ట్‌ గ్రాస్‌ వసూళ్లు చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.






ఇస్మైల్‌ దార్భర్‌ అందించిన సంగీతం మూవీకి మరింత ప్లస్‌ అయ్యింది. మ్యూజిక్‌ పరంగాను ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇకపోతే కంగనా ప్రస్తుతం లేడీ ఒరియంటెడ్‌, బయోపిక్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎక్కువ తమిళ ఇండస్ట్రీపై ఫోకస్‌ పెడుతున్న ఆమె కోలివుడ్‌లో వరుస ఆఫర్స్‌ అందుకుంది. ప్రస్తుతం ఆమె ఇండియన్‌ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌లో లీడ్‌ రోల్‌ పోషిస్తుంది. 1975లో ఎమర్జెన్సీ పిరియడ్‌ నేపథ్యంలో ఈ మూవీ సాగనుంది. ఇక సినిమాకు రచన, దర్శకత్వం కంగనే కావడం విశేషం. ఈ మూవీ జూన్‌ 14న విడుదల కానుంది. దీనితో పాటు ఆర్‌ మాధవన్‌తో ఓ సినిమా చేస్తుంది. ఇటీవల గ్రాండ్‌ చెన్నైలో పూజ కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది.