Kamna Jethmalani Re Entry: టాలీవుడ్‌లోకి మరో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ - 'రణం' బ్యూటీ ఈజ్ బ్యాక్
నితిన్ 'తమ్ముడు'తో తెలుగు తెరపై హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరొక హీరోయిన్ రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. 'రణం' బ్యూటీ చేసిన లేటెస్ట్ సినిమా ఏంటో తెలుసా?

నితిన్ 'తమ్ముడు' సినిమా గుర్తు ఉందా? అందులో హీరోకి అక్క పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసుగా? లయ. ఒకప్పుడు హిట్ సినిమాలు చేశారు. హీరోయిన్ కెరీర్ వదిలేసి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు. 'తమ్ముడు'తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ రోల్స్ కాకుండా అక్క పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. ఇక నారా రోహిత్ 'సుందరకాండ'తో మరొక హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ లిస్టులో కామ్నా జెఠ్మలానీ చేరబోతున్నారు.
కిరణ్ అబ్బవరం 'కే ర్యాంప్'లో కామ్నా!
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా 'కే ర్యాంప్'. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ చూశారా? ఆ ట్రైలర్‌ను జాగ్రత్తగా గమనిస్తే కామ్నా జెఠ్మలానీ కనిపిస్తారు.
సీనియర్ నరేష్ ఒకరి వెనుక పడుతున్నట్టు ఓ సీన్ ఉంది. అందులో వెనక్కి తిరిగి చూసే లేడీ కామ్నా జెఠ్మలానీ. స్క్రీన్ మీద ఆవిడ ఎంత సేపు కనిపిస్తుంది? ఆమె ఎటువంటి క్యారెక్టర్ చేశారు? అనేది అక్టోబర్ 17న గానీ తెలియదు. దీపావళి కానుకగా ఈ సినిమా ఆ రోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి రెండు సంవత్సరాల క్రితం జీ5 ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ 'వ్యవస్థ'లో కామ్నా జెఠ్మలానీ నటించారు. అయితే... ఆవిడ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ మాత్రం 'కే ర్యాంప్' సినిమాయే.
Also Read: సమంత కొత్త ఇల్లు చూశారా? త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఫోటోస్ షేర్ చేసిన బ్యూటీ
'ప్రేమికులు' సినిమాతో కథానాయికగా కామ్నా జెఠ్మలానీ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత గోపీచంద్ జంటగా నటించిన 'రణం'తో హిట్ వచ్చింది. 'అల్లరి' నరేష్ సరసన రెండు మూడు సినిమాలు చేశారు. పెళ్లి, పిల్లలు తర్వాత కామ్నా జెఠ్మలానీ కెరీర్‌కు బ్రేక్ వచ్చింది. తెలుగు - కన్నడ ద్విభాషా సినిమా 'చంద్రిక' ఆవిడ లాస్ట్ ఫిల్మ్. అది 2015లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కిరణ్ అబ్బవరం 'కే ర్యాంప్'తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీని తరువాత వరుసగా సినిమాలు చేసే ఆలోచనలో కామ్నా ఉన్నారట.
Also Read: రవితేజ బయోపిక్... మాస్ మహారాజా ఓపెన్ అయితే టిల్లు భాయ్ రెడీ!





















