Kamal Haasan Speech In Sing Geetham Pre Release Event : 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టి 'సింగ్ గీతం'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఈ నెల 11న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఆదివారం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై సింగీతంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
'45 ఏళ్ల స్టోరీ'
తన 21 ఏళ్ల వయసులో సింగీతంతో తన జర్నీ స్టార్ట్ అయ్యిందని... ఫస్ట్ మూవీ క్యాజువల్‌గానే తెరకెక్కిందని అన్నారు కమల్ హాసన్. 'సింగీతం శ్రీనివాసరావుకు సినిమాపై ఎంతో ప్రేమ. ఆ విషయంలో ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. మా ఫస్ట్ మూవీ క్యాజువల్‌గానే తెరకెక్కింది. తర్వాత నాకు రెండు కథలు చెప్పారు. వాటిలో ఒకటి పుష్పక విమానం తెరపైకి వచ్చింది. రెండో దాని గురించి 45 ఏళ్లుగా మాట్లాడుకుంటున్నా... కానీ చేయలేకపోయాం.
అదే ఈ 'సింగ్ గీతం'... టేక్ 1, టేక్ 2, టేక్ 3 చెప్పినట్లు... సింగీతానికి ఏజ్ కేవలం నెంబర్ మాత్రమే. నేను తమిళనాడులో ఉన్నప్పుడు ఆయన పేరును కొందరు సంగీతం అని పలికేవారు. ఇన్నేళ్ల తర్వాత సినిమా పేరుతో సంగీతం కాదు సింగీతం అంటూ క్లారిటీ ఇచ్చారు.' అంటూ నవ్వులు పూయించారు.
Also Read : Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
'ఆ మూవీ రూ.200 కోట్లు'
ఓ స్టార్ హోటల్‌లో 'పుష్పక విమానం' షూటింగ్ చేసినట్లు తెలిపారు కమల్ హాసన్. 'సినిమా అంతా ఏసీలోనే షూట్ చేసినందుకు గర్వంగా ఉంది. ఆ రోజుల్ని చాలా మిస్ అవుతున్నా. అప్పట్లో పుష్పక విమానం రూ.15 లక్షల్లో తీశాం. ఇప్పుడు అది రూ.200 కోట్ల మూవీ వంటిది. 720Pలో షూట్ చేసిన ఫస్ట్ డిజిటల్ మూవీ ఇది.
ఆలోచనల్లో జెన్ జీ కన్నా ఓ అడుగు ముందే ఉంటారు సింగీతం. ఆయన్నుంచి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయాలని ఉంది. స్టార్స్ ఉంటేనే పెద్ద సినిమా కాదు. పెద్ద సినిమా అంటే గొప్ప ఐడియా ఉండాలి. ఏ సినిమా హిట్ అవుతుంది? ఏది ఫెయిల్ అవుతుంది? అన్నది ఎవరూ చెప్పలేరు. సినిమా హిట్ అయితే అర్హత ఉన్నా లేకున్నా క్రెడిట్ కోసం తాపత్రయపడతారు. కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఒకరినొకరు నిందించుకుంటారు.' అని అన్నారు.
ఇండస్ట్రీలోనే అప్పట్లో పుష్పక విమానం మూవీ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. 'విచిత్ర సహోదరులు', 'మైఖేల్ మదన కామరాజు', 'ఆదిత్య 369' ఇలా ఎన్నో హిట్ చిత్రాలు అందించారు సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో 'సింగ్ గీతం' అనే మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించగా... దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
Also Read : Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
