Kalki 2898 AD Day 6 Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, విజనరి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న వరల్డ్ వైడ్ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు ప్రభంజనం సృష్టిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో సునామీ వసూళ్లు రాబడుతుంది. ఈ మూవీ రిలీజై రెండు వారాలైనా ఇప్పిటికీ అదే జోరు చూపిస్తుంది. థియేటర్లోకి వచ్చినప్నటి నుంచి ఈ చిత్రం రికార్డు మీద రికార్డుల కొల్లగోడుతూనే ఉంది. మూడు రోజుల్లోనే కల్కి 2898 ఏడీ రూ. 500 కోట్ల గ్రాస్ మార్క్ చేరింది.
విజువల్ వండర్‌గా వెడితెరపై ఈ చిత్రం ఆడియన్స్ నుంచి విశేష స్పందన అందుకుంది. దీంతో అతి తక్కువ టైంలోనే 'కల్కి 2898 ఏడీ' వెయ్యి కోట్ల మార్క్ చేరింది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి రికార్టుకు ఎక్కింది. విషయాన్ని స్వయంగా మూవీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. దీంతో ప్రభాస్ కెరీర్‌లో 'బాహుబలి 2' తర్వాత వెయ్యి కోట్ల మార్క్ కొట్టేసిన రెండో సినిమాగా 'కల్కి 2898 ఏడీ' నిలిచింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. నిజానికి సౌత్ ఇండియాలో 'కల్కి 2898 ఏడీ' నాన్-బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిందనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సర్‌ప్రైజింగ్ వసూళ్లు రాబట్టింది. ఇక హిందీలోనూ కల్కి 2898 ఏడీ భారీ వసూళ్లు చేస్తూ 'గదర్ 2' దేశీయ కలెక్షన్స్‌ని అధిగమించింది. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండ విడుదలైన సన్నీ డియోల్ గదర్ 2 బాక్సాఫీసు వద్ద ప్రభంజం సృష్టిస్తుంచింది. థియేట్రికల్ రన్ మొత్తంలో ఈ సినిమా రూ. రూ.525.7 కోట్ల గ్రాస్ చేసి అందరిని ఆశ్చర్యపరించింది. అయితే హిందీలో ఈ మూవీ మొత్తం కలెక్షన్స్ 'కల్కి 2898 ఏడీ' రెండు వారాల్లోనే రాబట్టింది. అంతేకాదు ఓవర్సిస్‌లోనూ ఈ సినిమా జోరు మామూలుగా లేదు. ఇప్పటి వరకు ఏ సౌత్ ఇండియా మూవీ చేయని వసూళ్లు చేసి రికార్డు సెట్ చేసింది. నార్త్ అమెరికాలో ఓ తెలుగు సినిమా 10 మిలియన్ల డాలర్లు రాబట్టడమే పెద్ద విశేషం. కానీ, కల్కి 2898 ఏడీ ఏకంగా 17 మిలియన్ల డాలర్లు వసూళ్లు చేసింది. ఇంకా కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి.
అంతగా నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'తో మ్యాజిక్ చేశారు. మహాభారతానికి సూన్స్ ఫిక్షన్ జోడించి వెండితెరపై అద్భుతం చేశాడు. నాగ్ అశ్విన్ విజన్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. దీంతో సాధారణ ఆడియన్స్ నుంచి సినీ దిగ్గజాల నుంచి కూడా నాగ్ అశ్విన్‌కి ప్రశంసలు వస్తున్నాయి. రిలీజ్‌కు ముందు థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ రూ. 1000 కోట్ల గ్రాస్ చేస్తుందని ఊహించారు. కానీ రెండు వారాల్లోనే ఈ మూవీ ఆ మార్క్ కొట్టేయడంతో ఇక మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇంకా మూవీ జోరు చూస్తుంటే థియేట్రికల్ రన్ మొత్తంలో 'కల్కి 2898 ఏడీ' ఆర్‌ఆర్‌ఆర్, బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడం పక్కా అంటున్నారు. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంలోపై నిర్మాత అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించారు. దాదాసు రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించారు.