నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. 'వీర సింహా రెడ్డి' విజయం తర్వాత వాళ్ళిద్దరి కలయికలో తెరకెక్కుతోన్న చిత్రమిది. బాలకృష్ణ 111వ సినిమా కావడంతో NBK111ని వర్కింగ్ టైటిల్‌గా పెట్టారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆవిడ ఏం చెప్పారంటే?
న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా!Kajal Aggarwal On NBK111: 'భగవంత్ కేసరి'లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించారు. ఇప్పుడీ ఎన్.బి.కె 111లో వాళ్ళిద్దరి కలయికలో రెండో సినిమా. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమా సెట్స్‌లో అడుగు పెట్టినట్టు... ఆమె తెలిపారు.
ప్రస్తుతం ఎన్.బి.కె111 చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కాజల్ మూడు రోజుల షూటింగ్ కంప్లీట్ చేశారు. సినిమా తెరకెక్కుతున్న తీరుపై ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్నారని సమాచారం. ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి కాజల్ మాట్లాడుతూ... ''NBK111 ఓ న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా. ఇందులో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని కథను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది. మాస్ ప్రేక్షకులను అలరించడంతో పాటు న్యూ ఏజ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కుతోంది'' అని చెప్పారు.
బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా...NBK111 First Look: జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్.బి.కె 111 నుంచి సర్‌ప్రైజ్ ఉంటుందని యూనిట్ అనౌన్స్ చేసింది. ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని టాక్. 'నో మోర్ వింటేజ్... ఓన్లీ న్యూ ఏజ్' అని అంచనాలు పెంచారు గోపీచంద్ మలినేని. 'పెద్ది' తర్వాత వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Janhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు
