RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థ, ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao Jr)తో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఎన్టీఆర్ ఆఫీసు పేర్కొంది. ఆ సంస్థకు, ఎన్టీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
'రా ఎన్టీఆర్' సంస్థ వల్ల రాజకీయ చర్చ'ఊరూ వాడ' (Ooru Vaada Campaign) పేరుతో వంద కోట్ల రూపాయలతో సేవా యజ్ఞం మొదలు పెడుతున్నామని 'రా ఎన్టీఆర్' సంస్థ పేర్కొంది. దాని వెనుక ఎన్టీఆర్ ఉన్నారని భావన ప్రజల్లో కలిగేలా వ్యవహరించింది. దాంతో రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎన్టీఆర్ ఆ సంస్థను తెరపైకి తీసుకు వచ్చారని పలువురు భావించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆఫీసు ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read: Jr NTR Political Buzz - ఎన్టీఆర్‌కు సంబంధం లేదు - 'ఊరూ వాడ' వెనుక ఫుల్ కహానీ
''ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా ఆ సంస్థ తలపెట్టిన కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు'' అని ఎన్టీఆర్ ఆఫీసు స్పష్టం చేసింది. దీంతో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ఊహాగానాలకు చెక్ పెట్టింది ఎన్టీఆర్ ఆఫీసు.
Also Read: Shruti Haasan New Chennai Home - శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?
''ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమం లేదా అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల సమాచారం ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం మాత్రమే వెల్లడిస్తుంది'' అని ఎన్టీఆర్ ఆఫీసు తెలిపింది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు చేసే ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ అంశం (రా ఎన్టీఆర్ లేదా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం)పై ఇదే తమ తరఫున తుది వివరణ అని ఎన్టీఆర్ ఆఫీసు స్పష్టం చేసింది. ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పడుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. అన్ అఫీషియల్ న్యూస్ స్ప్రెడ్ చేయవద్దని కోరింది.
