Clarification About JD Chakravarthy Joins Prabhas Kalki 2898AD Sequel : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ 'కల్కి 2898 AD'. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రెడీ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Continues below advertisement

ఇప్పటికే ప్రభాస్ లేకుండానే షూటింగ్ జరుగుతుండగా... అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లపై హైదరాబాద్ షెడ్యూల్‌లో కీలక సీన్స్ షూట్ చేశారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత లెజండరీ నటులు షూటింగ్ సెట్‌లో సందడి చేశారు. సినిమాలో నెగిటివ్ రోల్ సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్, అశ్వత్థామగా అమితాబ్ నటించారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

ఆ ప్రచారంపై...

Continues below advertisement

'కల్కి 2898AD' సీక్వెల్ షూటింగ్ సెట్‌లో జేడీ చక్రవర్తి, దుల్కర్ సల్మాన్ జాయిన్ అయ్యారనే ప్రచారం సాగింది. జేడీని ఎప్పుడు ఎంపిక చేశారు? ఆయన ఏ రోల్ చేస్తున్నారు? అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ సాగింది. దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకూ జేడీ ఈ ప్రాజెక్టులో భాగం కాదు. ఎక్కడా, ఎలాంటి షూటింగ్ జరగడం లేదని తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకూ ఇలాంటి న్యూస్ ప్రచారం చెయ్యొద్దంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : ఆరేళ్ల పిల్లాడు ఆర్జీవీ శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్

ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఇతర నటీనటులతో కీలక సీన్స్ షూట్ చేసి ఆ తర్వాత ప్రభాస్‌తో షూటింగ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కాగా త్వరలోనే ప్రభాస్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీస్ చేస్తున్నారు. డార్లింగ్ కల్కి షూటింగ్‌లో జాయిన్ అయ్యే రోజు కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కర్ణుడి పాత్రలో కనిపించనున్నారు.

అమితాబ్ బచ్చన్ ఇప్పటికే తన పార్ట్ కంప్లీట్ చేసుకుని ముంబై వెళ్లిపోయారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ కలిసి ఈ సినిమాలో నటించారు. హైదరాబాద్ షూటింగ్ సెట్‌లో వీరిద్దరూ కలిసి సందడి చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరూ కలిసి లాస్ట్‌గా 1985లో వచ్చిన 'గెరాఫ్తార్' మూవీలో నటించారు.

దీపికా ప్లేస్‌లో ఎవరు?

ఫస్ట్ పార్ట్‌లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కీలక రోల్‌లో నటించగా... అనుకోని కారణాలతో సీక్వెల్‌లో ఆమెను తప్పించారు. ఆమె స్థానంలో ఎవరు నటిస్తారనేది ఇప్పటివరకూ సస్పెన్సే. చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించినా మేకర్స్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా... ప్రభాస్‌తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, శోభన తదితరులు కీలకపాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.