ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్‌ల 'బేబీ', సుహాస్ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్', రష్మికా మందన్నా 'ది గర్ల్ ఫ్రెండ్'తో కంటెంట్ & స్టోరీ బేస్డ్ కథలతో సినిమాలు తీసి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni). ప్రొడ్యూస్ చేయడమే కాదు... డిస్ట్రిబ్యూటర్‌గానూ మంచి సినిమాలు పంపిణీ చేశారు.
ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays Movie Telugu). ఇందులో జయసుధ నటిస్తున్నారు. ఇవాళ ఆవిడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'సమ్మర్ హాలిడేస్'లో సహజ నటిబాలల సినిమాగా తెరకెక్కించిన 'సమ్మర్ హాలిడేస్' చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా అందమైన కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శ్రీకర్. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. ఇందులో సహజ నటి జయసుధ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read: Gabbar Singh Ramesh - 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్ 'సమ్మర్ హాలిడేస్'లో అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో జయసుధ నటిస్తున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. ఆవిడ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. "ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మ సుశీలమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుకి హత్తుకోనుంది'' అని చిత్ర బృందం పేర్కొంది.
Summer Holidays Movie Cast And Crew: రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ తదితరులు నటిస్తున్న 'సమ్మర్ హాలిడేస్' సినిమాకు ఛాయాగ్రహణం: సాయి ప్రకాశ్, సంగీత దర్శకుడు: సింజిత్ యెర్రమల్లి, నిర్మాణ సంస్థ: ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, కథ - దర్శకుడు: శ్రీకర్, నిర్మాత: ధీరజ్ మొగిలినేని.
Also Read: నిహారిక ప్రేమలో పడిందన్నారు... ఫోటోలు వైరల్ చేశారు... అసలు కహానీ ఏమిటంటే?
