Amitabh Bachachan and Jaya Bachchan Assets Value: తన భర్త అమితాబ్ బచ్చన్ బాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా ఉండగా.. జయా బచ్చన్ మాత్రం రాజకీయాల్లోనే సెటిల్ అయిపోవాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు రాజ్యసభ ఎన్నికల్లో నిలబడిన జయా.. అయిదోసారి కూడా పోటీకి సిద్ధమయ్యారు. ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ ఎలక్షన్ అభ్యర్థిగా తనను ఎన్నికల్లో నిలబెట్టింది సమాజ్‌వాది పార్టీ. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ ద్వారా జయా, అమితాబ్ బచ్చన్‌ల ఆస్తుల వివరాలు బయటికొచ్చాయి. తనతో పాటు అమితాబ్ ఆస్తుల విలువ ఎంతో కూడా జయా స్వయంగా బయటపెట్టారు. తమ బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా రివీల్ చేశారు.


నెట్ ఆస్తులు ఎంతంటే..?


2022 - 23 ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయ్యేసరికి జయా బచ్చన్ పర్సనల్ ఆస్తుల విలువ రూ.1.63 కోట్లు అని జయా బచ్చన్ చెప్పుకొచ్చారు. ఇక అదే సంవత్సరం తన భర్త పర్సనల్ ఆస్తుల విలువ రూ.273.74 కోట్లు అని తెలిపారు. కేవలం నెట్ ఆస్తుల విలువ మాత్రమే కాకుండా ఈ అఫిడవిట్ ద్వారా వారి పూర్తి ఆస్తుల వివరాలు బయటికొచ్చాయి. అఫిడవిట్ ప్రకారం.. ప్రస్తుతం జయా బచ్చన్ బ్యాంక్ అకౌంట్‌లో రూ.10.11 కోట్ల బ్యాలెన్స్ ఉంది. అమితాబ్ బచ్చన్ బ్యాంక్ అకౌంట్‌లో రూ.120.45 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఇక వీరిద్దరి చరాస్తుల విలువ రూ.849.11 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ.729.77 కోట్లు అని తెలుస్తోంది.


పలు రకాల ఆదాయం..


ఎలక్షన్ అఫిడవిట్‌లో కేవలం ఆస్తుల, ఆదాయం వివరాలు మాత్రమే కాకుండా ఆ ఆదాయం ఎక్కడ నుండి వస్తోందనేది కూడా వివరించాలి కాబట్టి జయా బచ్చన్.. ఆ వివరాలను కూడా బయటపెట్టారు. తనకు ఆదాయం చాలా రకాలుగా వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఎండోర్స్‌మెంట్ ద్వారా ఆమెకు ఆదాయం వస్తుందని, పార్లమెంటు సభ్యురాలిగా తనకు జీతం అందుతుందని, యాక్టింగ్ వల్ల తనకు రెమ్యునరేషన్ అందుతుందని జయా బచ్చన్ తెలిపారు. అదే విధంగా అమితాబ్ బచ్చన్‌ కూడా ఇంట్రెస్ట్, రెంట్, సోలార్ ప్లాంట్ ద్వారా ఆదాయం, యాక్టర్‌గా రెమ్యునరేషన్.. ఇలా పలు రకాలుగా సంపాదిస్తున్నారని అన్నారు. 


ఆభరణాలు, వాహనాలు..


ప్రస్తుతం జయా బచ్చన్ దగ్గర ఉన్న ఆభరణాలు రూ.40.97 కోట్ల విలువ ఉన్నట్టు తెలుస్తోంది. తన కారు విలువ రూ.9.82 లక్షలు అని సమాచారం. ఇక అమితాబ్ బచ్చన్ దగ్గర రూ.54.77 కోట్ల విలువ గల ఆభరణాలు ఉండగా.. తన దగ్గర మొత్తం 16 వాహనాలు ఉన్నాయట. ఇక ఈ వాహనాల విలువ మొత్తంగా రూ.17.66 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో రెండు మెర్సిడీస్, ఒక రేంజ్ రోవర్ కారు కూడా ఉన్నాయి. మునుపటి ఎన్నికలు అంటే 2018లో జరిగిన ఎన్నికల అఫిడవిట్‌లో అమితాబ్‌వి, తనవి కలిపి రూ.1000 కోట్లు ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. అయితే చాలా ఏళ్లుగా జయా బచ్చన్.. వెండితెరకు దూరమయ్యారు. తాజాగా కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చారు. 


Also Read: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో యశ్? క్లారిటీ ఇచ్చిన టీమ్