మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'పెద్ది' (Peddi Movie). ఆయనకు జంటగా నయా అతిలోక సుందరి, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తున్నారు. ఈ రోజు సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు క్యారెక్టర్ పేరు రివీల్ చేశారు.
అచ్చియమ్మగా జాన్వీ కపూర్Janhvi Kapoor character name in Peddi: 'పెద్ది' సినిమాలో అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఆమెది మాంచి మాసీ రోల్ అని, ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి మాసీ పాత్రలో చూస్తారని వివరించారు.
'పెద్ది' నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కాదు... రెండు లుక్స్ రిలీజ్ చేశారు. అందులో ఒక లుక్‌లో జీపులో వెళుతూ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. మరొక లుక్‌లో మైక్ ముందు నిలబడ్డారు. బహుశా... ఆమెది జానపద గాయని పాత్ర అయ్యి ఉండొచ్చు. పెద్ది ప్రేయసి అచ్చియ్యమ్మగా జాన్వీ కపూర్ కనిపిస్తారని చిత్ర బృందం వివరించారు.
మార్చిలో ప్రేక్షకుల ముందుకు!Peddi Release Date: 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 'పెద్ది' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఆ వారంలో రావాల్సిన నాని 'ప్యారడైజ్' వాయిదా పడినట్లు ఫిల్మ్ నగర్ గుసగుస. 'పెద్ది'కి ముందు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' మార్చి 19న విడుదల కానుంది.
Also Read: అల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ - మరి ఉపాసన సీమంతంలో అల్లు కుటుంబం ఎక్కడ?
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, జగపతి బాబు, 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో మొదటి పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాని కోసం ఒక స్పెషల్ వీడియో షూట్ చేస్తారట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.