Jana Nayagan Release Date : విజయ్ 'జన నాయగన్' రిలీజ్ అప్పుడేనా? - మేకర్స్ ప్లాన్ ఏంటి?
Jana Nayagan : దళపతి విజయ్ 'జన నాయగన్' మూవీ రిలీజ్‌పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సెన్సార్ వివాదాలు కంప్లీట్ అయిన తర్వాత ఓ స్పెషల్ డే రోజున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Thalapathy Vijay's Jana Nayagan Movie Sees Yet Another Delay By CBFC : కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కావాల్సిన మూవీ సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడొస్తుందా అనేది ఇప్పుడు అందరిలోనూ క్వశ్చన్ మార్క్.
మేకర్స్ ప్లాన్ ఏంటి?
రీసెంట్‌గా కెనడాలో ఇండియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేసే 'యార్క్ సినిమాస్' సంస్థ చేసిన ప్రకటనతో ఏప్రిల్ 30 లోపు సినిమా రిలీజ్ కాదని విషయం కన్ఫర్మ్ అయిపోయింది. అయితే, మేకర్స్ విజయ్ బర్త్ డే సందర్భంగా జూన్‌లో 'జన నాయగన్' రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అప్పటికైతే సెన్సార్ వివాదాలు కూడా కంప్లీట్ కావొచ్చని... ఆయన పుట్టినరోజు ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారట.
జూన్ 22న విజయ్ 52వ పుట్టిన రోజు కాగా మూడు రోజుల ముందు జూన్ 18న 'జన నాయగన్' రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఆ రోజు గురువారం కావడం ఆ తర్వాత లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని ప్లాన్ చేస్తున్నారు. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. త్వరగా అఫీషియల్ డేట్ అనౌన్స్ చేయాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read : అవును... మేం పెళ్లి చేసుకుంటున్నాం - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక
సెన్సార్ రివ్యూ స్టార్ట్ అయ్యిందా?
మూవీ టీం కేసులు వెనక్కి తీసుకుని రివైజింగ్ కమిటీకి పంపింది. అయితే, CBFC 'జన నాయగన్' రివ్యూ ఇంకా ప్రారంభించలేదనే టాక్ వినిపిస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్, ఫార్మాలిటీస్ పూర్తి కాకుండా ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేసే ఆస్కారం లేదు. అందుకే మేకర్స్ రిలీజ్ విషయంలో మౌనం వహిస్తున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం విజయ్ బర్త్ డే నాటికి అన్నీ కంప్లీట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు.
అసలేంటీ వివాదం?
'జన నాయగన్' ముందుగా U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు ఆ తర్వాత రివైజింగ్ కమిటీకి పంపాలని ఆదేశించింది. దీంతో మేకర్స్ సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. సెన్సార్ బోర్డు నిర్ణయంపై కోర్టు స్టే ఇవ్వగా... ఆ తర్వాత బోర్డు పిటిషన్‌తో డివిజన్ బెంచ్‌లో మేకర్స్‌కు చుక్కెదురైంది.
దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా... డివిజన్ బెంచ్‌లోనే తేల్చుకోవాలంటూ మూవీ మేకర్స్‌కు సూచించింది. ఈ క్రమంలో కేసును వెనక్కు తీసుకున్న మేకర్స్ మూవీని రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. ఆ తర్వాత మూవీ రిలీజ్ గురించి కానీ సెన్సార్ సర్టిఫికెట్ గురించి కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... విజయ్ సరసన పూజా హెగ్డే నటించారు. యంగ్ హీరోయిన్ మమితా బైజు విజయ్ కూతురిగా నటించారు. వీరితో పాటే బాబీ డియోల్, నరైన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు.
























