Jai Hanuman Update : హిస్టారికల్ ప్లేస్‌లో మైథలాజికల్ సీక్వెల్ 'జై హనుమాన్' - ఆంజనేయునిగా రిషబ్ శెట్టి... మూవీ ఎప్పుడంటే?
Jai Hanuman Movie : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'హను మాన్' సీక్వెల్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. హిస్టారికల్ ప్లేస్‌లో పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభం కానుంది.

Rishab Shetty's Jai Hanuman Movie Will Start In Hampi : యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ 'హను మాన్'. ఈ మూవీకి సీక్వెల్ 'జై హనుమాన్'పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సీక్వెల్‌లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఆంజనేయుని పాత్ర పోషిస్తుండడంతో ఆ హైప్ పదింతలైంది. తాజాగా చారిత్రక ప్రదేశంలో 'జై హనుమాన్' ప్రారంభం కానుంది.
షూటింగ్ ఎప్పటి నుంచంటే?
కర్ణాటకలోని హిస్టారికల్ ప్లేస్ 'హంపి'లో ఈ నెల 22న 'జై హనుమాన్' మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసినట్లు తెలుస్తుండగా... ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు టీం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీ తెరకెక్కనుంది.
2024లో సంక్రాంతికి రిలీజైన 'హను మాన్' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తేజ సజ్జా హీరోగా నటించగా... వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషించారు. విలన్ అడ్వెంచరస్ డ్రీమ్‌కు మైథలాజికల్ టచ్ ఇస్తూ అద్భుతమైన విజువల్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకోగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హీరో, డైరెక్టర్‌కు పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది.
స్టోరీ అదేనా?
'హనుమాన్' క్లైమాక్స్‌లో శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అనేది సస్పెన్స్‌గా ఉంచారు. ఇప్పుడు సీక్వెల్‌లో దాన్ని రివీల్ చేయనున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉండబోతోందంటూ ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ చెప్పారు.
Also Read : మరోసారి జంటగా సుహాస్, శివానీ నాగారం - నవ్వులు పూయిస్తోన్న 'హే భగవాన్' ట్రైలర్
























