Jai Hanuman : హిస్టారికల్ ప్లేస్‌లో 'జై హనుమాన్' - అంజనాద్రి బెట్టపై పూజా కార్యక్రమంతో... స్పెషల్ ఏంటో తెలుసా?
Jai Hanuman Pooja Ceremony : మైథలాజికల్ 'జై హనుమాన్' మూవీ షూటింగ్ హిస్టారికల్ ప్లేస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Teja Sajja's Jain Hanuman Movie Pooja Ceremony : 2024లో సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన మైథలాజికల్ ఎపిక్ 'హను మాన్'. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్ 'జై హను మాన్' కూడా అనౌన్స్ చేశారు. తాజాగా ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
అంజనాద్రి బెట్టపై...
హంపిలోని అంజనాద్రి బెట్టపై 'జై హనుమాన్' మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు హీరో తేజా సజ్జాతో పాటు రిషబ్ శెట్టి దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హాజరయ్యారు. ఈ మూవీలో రిషబ్ శెట్టి హనుమాన్‌గా నటిస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన ఆయన లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పూజా కార్యక్రమ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The pooja ceremony of #JaiHanuman #rishabshetty #prashantvarma pic.twitter.com/b683yEZG7L
— Rajesh Manne (@rajeshmanne1) February 22, 2026
Super Hero @tejasajja123 arrives at Anjanadri Betta, Hampi, for the grand pooja ceremony of the magnum opus #JaiHanuman. 🙏🔥 pic.twitter.com/JQ1gHsXBdV
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 22, 2026
The versatile actor #RishabShetty arrives for the pooja ceremony of the magnum opus #JaiHanuman at the Anjanadri Betta in Hampi ❤️🔥 pic.twitter.com/b2AzozrIR8
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 22, 2026
Also Read : సెట్‌లో అలా అంటే అవమానంగా అనిపించేది... సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్
'హను మాన్'లో హనుమంత్‌గా కనిపించనున్న తేజ సజ్జా సీక్వెల్‌లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. హనుమంతుడిగా రిషబ్ శెట్టి, మరో హీరో రానా దగ్గుబాటి కీలకపాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'హను మాన్' క్లైమాక్స్‌లో శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అనేది సస్పెన్స్‌గా ఉంచగా సీక్వెల్‌లో దానిపై క్లారిటీ ఇవ్వనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మించనుండగా... ఈ మూవీ కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
అంజనాద్రి బెట్ట స్పెషల్ ఏంటంటే?
'జై హను మాన్' మొత్తం హనుమంతుడి చుట్టూ సాగుతుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఆ సెంటిమెంట్‌తోనే అంజనాద్రి బెట్టలో పూజా కార్యక్రమంతో మూవీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. పురాణాల ప్రకారం ఈ స్థలంలో ఆంజనేయుడు జన్మ స్థలంగా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. కిష్కింధ భాగంలో ఓ ప్రాంతం. కొండపై ఉన్న విశాలమైన హనుమాన్ ఆలయాన్ని దర్శించుకునేందుకు దాదాపు 575 మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సమీపంలోనే శ్రీరాముడు, సీతా దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ కొండ హంపికి చాలా దగ్గరగా ఉంటుంది.
























