బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ 'జాట్'. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'జాట్' మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది అంటూ మేకర్స్ నుంచి తాజాగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. 

ఈ రోజే రిలీజ్ కావాల్సిన ట్రైలర్గోపీచంద్ మలినేని - సన్నీ డియోల్ కాంబినేషన్లో రూపొందుతున్న 'జాట్' మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. అలాగే రీసెంట్ గా బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు ప్రకటిస్తూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే 'జాట్' మూవీ నుంచి మార్చి 22న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నామని రీసెంట్ గా చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ ని నార్త్ ఇండియాలోని జైపూర్ లో ఉన్న విద్యాధర్ నగర్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు.

'జాట్ ట్రైలర్ రిలీజ్ వాయిదా తాజాగా ఈ మూవీ టీం ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి మరో అప్డేట్ తో వచ్చారు. ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అందులో మార్చి 22న అంటే ఈరోజు రిలీజ్ కావలసిన 'జాట్' ట్రైలర్ పలు అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయిందని ప్రకటించారు. "త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము, యాక్షన్ ఫీస్ట్ కోసం వెయిట్ చేయండి" అంటూ ఆ పోస్టర్లో రాశారు. దీంతో ఇప్పటిదాకా ఈ మూవీ ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కాసింత నిరాశకు గురయ్యారని చెప్పాలి. ఇక ఈ సినిమాకి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, ఇందులో సయామీ కేర్, రెజినామ్ వినీత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఏప్రిల్ 10న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.

ఇక సన్నీ డియోల్ విషయానికి వస్తే... 'గదర్ 2' మూవీతో బ్లాక్ బస్టర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఈ మూవీ హిట్ టాక్ తో 700 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 'వీరసింహా రెడ్డి' లాంటి హిట్ మూవీతో సూపర్ ఫామ్ లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ తో 'జాట్' అనే సినిమాను తీస్తుండడం ఆసక్తికరంగా మారింది. సన్నీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ దొరికింది. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.