Sreeleela Again Replaced: టాలీవుడ్‌ సెన్సేషన్‌ శ్రీలీలా కెరీర్‌కి బ్రేక్‌లు పడుతున్నాయా? ఇక ఆమెకు ఎదురుదెబ్బలు తప్పవా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. 'ధమాకా' నుంచి వరుస హిట్స్‌, బిగ్‌ ప్రాజెక్ట్స్‌, స్టార్‌ హీరో మూవీస్‌ ఇలా కెరీర్‌లో ఫుల్‌ స్వీగ్‌తో దూసుకుపోయింది శ్రీలీలా. ఇలా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిందో లేదో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. స్టార్‌ హీరోయిన్స్‌ పూజా హెగ్డే, రష్మిక వంటి స్టార్స్‌ రిప్లేస్‌ చేసింది. వచ్చి రాగానే టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న ఆమెకు కెరీర్‌కు ఇప్పుడు బ్రేక్స్‌ పడుతున్నాయి.


మొన్నటి వరకు అందరిని హీరోయిన్లను ఆమె రిప్లేస్‌ చేస్తుంది.. ఇప్పుడు ఆమెనే రిప్లేస్‌ అవుతుంది. ఇటీవల విజయ్‌ దేవరకొండ (#VD12) మూవీ నుంచి ఆమెను తీసేసిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల పేరు జస్ట్‌ ప్రకటన వరకే నిలిచిపోయింది. ఆ తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుందంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు నితిన్‌ సినిమా నుంచి కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది. నితిన్‌ లేటెస్ట్‌ చిత్రాల్లో 'రాబిన్‌ హుడ్‌'(robin Hood) ఒకటి. వెంకీ కుడుముల దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో మొదటి శ్రీలీల హీరోయిన్‌ అన్నారు. మొదట ఇందులో రష్మిక హీరోయిన్‌ అన్నారు. 'భీష్మ' ట్రయో అంటూ ప్రకటన ఇచ్చారు.


కానీ ఆ తర్వాత రష్మిక ఈ సినిమా చేయడం లేదని చెప్పి.. శ్రీలీల హీరోయిన్‌ అన్నారు. ఏమైందో ఏమో ఇప్పుడ రాశీ ఖన్నా 'రాబిన్‌ హుడ్‌' సెట్‌లో అడుగుపెట్టిందంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఈ తాజాగా అప్‌డేట్‌ ప్రకారం రాశీ ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫైనల్‌ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాలు మాత్రం రాశీ కీలక పాత్ర చేస్తుందని, ఆమె ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే శ్రీలీల ప్రస్తుతం తన ఎంబీబీఎస్‌ ఎక్సామ్స్‌ కోసం సినిమాలకు షాట్‌ బ్రేక్‌ తీసుకున్న సంగతి తెలిసిందే.


Also Read: సీతగా సాయి పల్లవి, దట్‌ ఈజ్‌ నేచురల్‌ బ్యూటీ - అందరి హీరోయిన్‌లా కాదు.. సో స్పెషల్‌


ఇటీవల మహేష్‌ బాబు 'గుంటూరు కారం' సినిమాలో శ్రీలీల తన మాస్‌ డ్యాన్స్‌ మెస్మరైజ్‌ చేసింది. ముఖ్యంగా కుర్చి మడతపెట్టి సాంగ్‌లో ఆమె డ్యాన్స్‌ ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. కాగా 'భీష్మ' కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ అవుతుండటంతో 'రాబిన్‌ హుడ్‌'పై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో మూవీ మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. 'ఏజెంట్ రాబిన్ హుడ్ రిపోర్ట్స్ ఆన్ డ్యూటీ ఫ‌ర్ అడ్వంచ‌ర్స్' అంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో నితిన్ ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపించారు. గ‌న్స్ తో, ఫోన్ లో మాట్లాడుకుంటూ న‌డుస్తున్న‌ట్లుగా ఉంది ఆ ఫొటో. ఇందులో నితిన్‌ లుక్‌ ఆడియన్స్‌ని బాగా ఆక్టుకుంది.