Nag Ashwin Shocing Post After Kalki 2898 AD Reach Rs 1000 Cr: ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీసు వద్ద వసూళ్ల దండయాత్ర చేస్తుంది. మూవీ విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ థియేటర్‌లో అదే జోరుతో కొనసాగుతుంది. 15 రోజుల్లోనే ఈ మూవీ రూ.1000 కోట్ల క్షబ్‌లోకి చేరింది. దీంతో ప్రభాస్‌ ఖాతాలో బాహుబలి 2 తర్వాత రూ.1000 కోట్లు సాధించిన రెండో సినిమా కల్కి 2898 ఏడీ నిలిచింది.మరోసారి డార్లింగ్‌ బాక్సాఫీసు కింగ్‌ అని నిరూపించుకున్నాడంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగిరేస్తున్నారు. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్‌ జోడించి నాగ్‌ అశ్విన్‌ వెండితెరపై విజువల్  వండర్‌ క్రియేట చేశాడు.


6000 వేల సంవత్సరం క్రితంకు వెళ్లి నాగ్‌ అశ్విన్‌ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడంటున్నారు. మొత్తానికి 'కల్కి 2898 ఏడీ'తో ప్రభాస్‌ అద్భుతం చేశాడని, ఆయన విజనరికి హ్యాట్సాఫ్‌ అంటూ అందరి చేతి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ మూవీ వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్‌ అందరిని షాకిస్తున్నాయి. నాగ్‌ అశ్విన్‌కి ఏమైంది ఇలాంటి కామెంట్స్‌ చేశారంటూ అంతా ఆయన పోస్ట్‌పై చర్చించుకుంటున్నారు. ఇంతకి ఆయన ఏమన్నారంటే. 




గోర్‌, అశ్లీలత లేకుండానే సక్సెస్..


"ఈ మైలురాయి… ఈ నెంబర్‌(₹1000 కోట్లు)... నిజానికి మనలాంటి యువతకు ఇదోక పెద్ద విజయమే. కానీ, వాస్తవానికి ఇక్కడ ఎలాంటి రక్థం, గోర్‌, అశ్లీలత, రెచ్చగొట్టే.. దోపిడీ కంటెంట్ లేదు. అయినా ఈ మైలురాయిని మనం సాధించడమంటే చిన్న విషయం కాదు... మూవీని ఆదరించి పెద్ద విజయానికి కారణమైన ప్రేక్షకులకు, నటీనటులకు బిగ్ థ్యాంక్యూ. ఇది ఇండియన్‌, రేపటికోసం #Repatikosam" అని రాసుకొచ్చారు. ఇక నాగ్‌ అశ్విన్‌ కామెంట్స్‌ చూసి నెటిజన్లంతా షాక్ అవుతున్నారు. ఆయన ఈ కామెంట్స్‌ ఆ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ని ఉద్దేశించి చేశారా? అని చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన సందీప్‌ రెడ్డి వంగా. ఈయన సినిమాలు బోల్డ్ కంటెంట్‌కు కేరాఫ్‌ అని చెప్పాలి. వాయిలెన్స్‌, బోల్డ్‌నెస్‌ ఎక్కువగా ఉంటుంది. దీనికి అర్జున్‌ రెడ్డి, ఇటీవల వచ్చిన యానిమల్‌ చిత్రాలే ఉదాహరణ.


సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేశారా?


గతేడాది రిలీజ్‌ అయిన యానిమల్‌ మూవీ ఎంతటి విజయం సాధించిందో చెప్పనవసరం. మితిమిరిన వాయిలెన్స్‌, రొమాన్స్‌, బోల్డ్‌ డైలాగ్స్‌తో వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. అలాగే ఓ వర్గం ఆడియన్స్‌ నుంచి అభ్యంతరాలు కూడా వచ్చాయి. మూవీలో మితిమిరిన బూతులు, రొమాన్స్ ఎక్కువైంది.. ఇది మన భారత సంస్కృతికి విరుద్ధమంటూ నెగిటివిటీ మూటగట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను బ్యాన్‌ చేయాలంటూ కొందరు డిమాండ్‌ కూడా చేశారు. అన్ని వివాదాల నడుమ యానిమల్‌ థియేటర్లో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అయ్యింది. థియేట్రికల్‌ రన్‌లో ఈ మూవీ రూ.950 కి పైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఇక యానిమల్‌ మూవీ తెరకెక్కించడంలో సందీప్‌రెడ్డి వంగా తీసుకున్న బోల్డ్‌ స్టేప్‌, ధైర్యానికి మిగతా డైరెక్టర్స్‌ సర్‌పైజ్‌ అయ్యారు.


అసూయ పడ్డారా?


తాము అయితే ఇలాంటి సినిమా చేసేవాళ్లం కాదని, టాలీవుడ్‌ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్‌ చేయాలంటే ఒకప్పుడు ఆర్జీవీ, ఇప్పుడు సందీప రెడ్డి వంగా అంటూ ఏకంగా దర్శక ధీరుడు జక్కన్న సందీప్‌ రెడ్డి వంగాపై కామెంట్స్‌ చేశారు. ఇక యానిమల్‌ సందీప్‌ రెడ్డికి యూత్‌లో యమ క్రేజ్‌ పెరిగింది. అలాంటి డైరెక్టర్‌ను నాగ్‌ అశ్విన్‌ టార్గెట్‌ చేయడమేంటని, ఆయన లవ్‌స్టోరీతో రూ. 300 కోట్లు, యానిమల్‌లో యాక్షన్‌తో రూ. 1000 కోట్లు సాధించారంటూ ఆయనతో మీ రైటింగ్స్‌ స్కిల్స్‌ పోల్చలేమంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్‌, భారీ స్టార్‌ కాస్ట్‌ లేకుండానే సందీప్‌ రెడ్డి వంగా భారీ విజయం సాధించారని, ఆయనకు వచ్చిన ఫేం చూసి నాగ్‌ అశ్విన్‌ అసూయపడుతున్నారా? కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నాగ్‌ అశ్విన్‌ తన స్టేట్‌మెంట్‌తో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచారు.



Also Read: ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేస్తున్న 'ఆడు జీవితం' - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..