Raviteja's Irumudi Trailer Release Date Locked : మాస్ మహారాజ రవితేజ, శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతోన్న ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి'. ఎప్పుడూ మాస్ పాత్రలతో అలరించే రవితేజ ఇప్పుడు సరికొత్తగా ఫాదర్ ఎమోషనల్ రోల్‌లో కొత్తగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ ట్రెండ్ అవుతుండగా... తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.

Continues below advertisement

ట్రైలర్ ఎప్పుడంటే? 

'ఇరుముడి' ట్రైలర్‌ను ఆగస్ట్ 12న (బుధవారం) రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. భీమవరంలో SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ఈవెంట్‌లో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకకు రవితేజతో పాటు మూవీ టీం మొత్తం హాజరు కానున్నారు. ఆగస్ట్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Continues below advertisement

Also Read : Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్

తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. భార్య, కూతురు ప్రాణంగా బతికే ఓ మధ్య తరగతి తండ్రి... తండ్రంటే ప్రాణం పెట్టే కూతురు మందు మానేయాలని తండ్రిని కోరుతుంది. మరి ఆ వ్యసనం మానేందుకు అయ్యప్ప మాల ధరించి దీక్ష తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కూతురు కోసం తండ్రి ఇంకా ఏం చేశాడు? అందమైన పల్లెటూరిలో భార్య, భర్త ఓ కూతురు మధ్య సాగే అందమైన జీవితం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా... రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా చేశారు. వీరి కుమార్తెగా చిన్నారి నక్షత్ర కీలకపాత్ర పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, రవిశంకర్ నిర్మించారు. ఆగస్ట్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.