నటీనటులు ఎప్పుడూ తమ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్ గురించి కూడా తమ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా నటీమణులు.. అందులోనూ పెళ్లయ్యి, పిల్లలు ఉన్న హీరోయిన్స్.. తమ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. తాజాగా ఇలియానా కూడా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. అంతే కాకుండా తన ముద్దుల కొడుకు గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది. తాజాగా తన కొడుకును ఎత్తుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇలియానా. ఇది చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.


క్యూట్ బేబీ బాయ్..
ఒకప్పుడు జీరో సైజ్ బ్యూటీగా టాలీవుడ్‌లో ఏలేసిన ఇలియానా.. సినిమాలకు దూరమయ్యి చాలాకాలమే అయ్యింది. అదే సమయంలో తను సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్‌గా లేదు. కానీ ఒక్కసారిగా తను ప్రెగ్నెంట్ అంటూ ఇలియానా పెట్టిన పోస్ట్.. సోషల్ మీడియాలో దుమారాన్ని రేపింది. అసలు ఇలియానా పార్ట్‌నర్ ఎవరు, తనకు పెళ్లి అయ్యిందా లేదా, ఇప్పుడు తను ఎవరితో కలిసుంటుంది లాంటి ప్రశ్నలు.. ఫ్యాన్స్‌ను కలవరపెట్టాయి. తన ప్రెగ్నెన్సీ విషయం కన్ఫర్మ్ చేసిన కొంతకాలానికి అంటే 2023, మే 13న తనకు పెళ్లయిన విషయాన్ని బయటపెట్టింది ఇలియానా. ఆ తర్వాత కొన్నిరోజులకే అంటే 2023, ఆగస్ట్ 1న ఒక బేబీ బాయ్‌కు జన్మనిచ్చింది.


సంతోషంతో మనసు నిండిపోయింది..
బేబీ బాయ్ పుట్టిన వెంటనే ఆ సంతోషకరమైన వార్తను తన ఫ్యాన్స్‌తో, ఫాలోవర్స్‌తో పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇలియానా. తన బేబీ ఫోటోతో పాటు తనకు కోవా ఫినిక్స్ డోలాన్ అని పేరు పెట్టినట్టు కూడా ప్రకటించింది. ‘మా డార్లింగ్ బాయ్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించడానికి మేము ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేము. మా మనసులన్నీ సంతోషంతో నిండిపోయాయి’ అంటూ తన బేబీ బాయ్ పుట్టినరోజు తను ఎంత సంతోషంగా ఉందో బయటపెట్టింది ఇలియానా.


ఫ్యాన్స్ ఎదురుచూపులు..
తాజాగా తన బేబీ బాయ్ పుట్టి రెండు నెలలు పూర్తయ్యింది అంటూ ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేసింది ఇలియానా. ఈ ఫోటోలో తను.. కోవాను ఎత్తుకొని ఉంది. ఇది చూసిన నెటిజన్లు.. ఫోటో చాలా క్యూట్‌గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఇలియానా కొన్నాళ్లు తన ప్రొఫెషనల్ లైఫ్‌కు బ్రేక్ ఇచ్చి పూర్తిగా పర్సనల్ లైఫ్‌పై దృష్టిపెట్టాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. రణదీప్ హుడాతో ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్‌లీ’ అనే చిత్రంలో నటించిన ఇలియానా.. ఇప్పటికే దీని షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కానీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. మరోవైపు తెలుగులో కూడా తన ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఇలియానాను వెండితెరపై చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. తను చివరిగా రవితేజ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూవీ మినిమమ్ హిట్ కూడా అందుకోకపోవడంతో ఇలియానా రీఎంట్రీకి ఎక్కువగా హైప్ క్రియేట్ అవ్వలేదు.






Also Read: ఆ మూవీకి ‘సలార్’ రీమేక్? అసలు విషయం చెప్పిన దర్శకుడు ప్రశాంత్ నీల్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial