Ilayaraja vs Sa Re Ga Ma: ఇళయరాజాకు పంచ్... రైట్స్ ఇష్యూలో రివర్స్ గేర్ - ఇప్పుడేం చేస్తారో?
Ilayaraja Latest News: ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన సినిమాల్లో పాటలు వాడితే ఏం జరుగుతుందో ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనకు రివర్స్ పంచ్ తగిలింది.

Ilayaraja Copyright Cases: ఇళయరాజా సంగీతం అందించిన సినిమాల్లో పాటను కొత్త సినిమాల్లో ఉపయోగించాలంటే ఆయన అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఆ సంగతి ప్రేక్షకులకు సైతం తెలుసు. ఒకవేళ అనుమతి తీసుకోకపోతే... తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఇళయరాజా నుంచి కాపీ రైట్ నోటీసు వస్తుంది. 'నారి నారి నడుమ మురారి'లో ఫన్నీగా పంచ్ కూడా వేశారు. హీరో శర్వాతో రాజాగారు నోటీసులు పంపిస్తారని సుదర్శన్ అంటారు. అటువంటి ఇళయరాజాకు కాపీరైట్స్ విషయంలో పంచ్ తగిలింది.
ఇళయరాజాకు ఢిల్లీ కోర్టు ఆదేశాలు...
ఆ పాటలను వాడటానికి వీల్లేదు అండీ!
ఇళయరాజా పలు సినిమాలకు సంగీతం అందించారు. అయితే... ఆయా సినిమాల్లో 134 సినిమాల నిర్మాతలు తమ సినిమాల్లో పాటల హక్కులను 'సరిగమ' సంస్థకు విక్రయించారు. అది కూడా శాశ్వత ప్రాతిపదికన. అయితే ఆ సినిమాల్లో పాటలు ఉపయోగించుకోవచ్చని కొన్ని మ్యూజికల్ ప్లాట్‌ఫారమ్‌లకు ఇళయరాజా అనుమతి ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 'సరిగమ' సంస్థ ఢిల్లీ హై కోర్టు (Delhi High Court)ను ఆశ్రయించింది. ప్రస్తుతానికి ఆ వివాదంలో రాజాగారి చుక్కెదురు అయ్యింది.
నిర్మాతల నుంచి రైట్స్ తీసుకున్న 'సరిగమ' సంస్థకు పూర్తి హక్కులు ఉంటాయని, ఆ పాటలు తుది తీర్పు వచ్చే వరకు వాడుకోవడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకు పలువురు నిర్మాతలకు మాస్ట్రో ఇళయరాజా నోటీసులు పంపించారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఇళయరాజాకు ఓ సంస్థ నోటీసులు పంపింది. తమిళ సినిమా 'అగత్యా' సినిమాలోని ఓ పాట విషయంలో వాళ్ళిద్దరి మధ్య వివాదం నెలకొంది. అప్పటి నుంచి చిలికి చిలికి గాలివానగా పెద్దది అవుతోంది.
Also Read: Allu Arjun Controversy: సారీ అల్లు అర్జున్ గారూ... నాది తప్పే, క్షమించండి - దిగొచ్చిన బాలీవుడ్ లేడీ























