ర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తనకు నచ్చింది చేయడం, అనిపించింది చెప్పడంలో ఆయన తర్వాతే మరెవరైనా. రామ్ గోపాల్ వర్మకు ఎన్నోసార్లు మాఫియా డాన్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. అయినా, తను ఏనాడు భయపడలేదని చెప్పారు. తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, జీవితంలో ఒకేఒక్కసారి భయంతో వణికిపోయినట్ఉల చెప్పారు.


20 సెకెన్ల పాటు భయపడ్డా- వర్మ


“నా జీవితంలో భయం అనేది లేదు. కానీ, ఓసారి 20 సెకెన్ల పాటు భయపడ్డాను. నా జీవితంలో నేను భయపడింది అదొక్కసారే. బాంబేలో నేను ఓ బిల్డింగులో 7వ అంతస్తులో ఉండేవాడిని. నేను బయటకు వెళ్లే ముందు నా బాయ్.. డ్రైవర్ కు కాల్ చేస్తాడు. డ్రైవర్ బిల్డింగ్ వెనుక నుంచి కారును తీసుకొని వస్తాడు. అక్కడ రెండు గేట్లు ఉంటాయి. ఒకటి కుడివైపు, మరొకటి ఎడమ వైపు ఉంటుంది. నేను కిందికి దిగి వచ్చాను. అప్పటి వరకు కారు రాలేదు. నేను బయటకు చూశాను. అక్కడ ఓ వ్యాన్ ఆగి ఉంది. అందులోని నలుగురు నన్ను చూస్తున్నారు. నన్ను చూస్తూ వ్యాన్ నెమ్మదిగా వెనక్కి వెళ్లింది. వాళ్లు నా కోసమే వచ్చారనే అనుమానం కలిగింది. ఆ సమయంలో అండర్ వరల్డ్ వారితో నాకు విభేదాలు ఉన్నాయి. వారిని చూసి నేను కాస్త వెనక్కి వచ్చాను. నా డ్రైవర్ వచ్చిన తర్వాత.. మళ్లీ నేను ముందుకు వెళ్లాను. వాళ్లు కనిపించలేదు. వాళ్లు వెళ్లిపోయారు అనుకున్నాను. నేను కారు ఎక్కాను. ఆ వ్యాన్ మా అపార్ట్ మెంట్ లోపలికి వచ్చింది. వాచ్ మెన్ వారిని మీరు ఎవరు అని అడుగుతున్నాడు. అప్పుడు నేను భయపడ్డాను.  వెంటనే కారులో నుంచి దిగి మెట్ల మీదుగా 5వ అంతస్తుకు వెళ్లను. అక్కడ నుంచి 10వ అంతస్తుకు వెళ్లాను. అక్కడ ఓ ఇంటి డోర్ కొట్టాను. వారు బయటకు వచ్చి నన్ను గుర్తు పట్టారు. నా ఫోన్ కారులో మర్చిపోయాను. వాళ్లకు చెప్పి సెక్యూరిటీ అతడికి ఫోన్ చేశాను. మా డ్రైవర్ ను పిలిచాను. ఏమైంది అని అడిగాను. వాళ్లు లిఫ్ట రిపేర్ చేయడానికి వచ్చారని చెప్పాడు. నన్ను ఎందుకు చూస్తున్నారు? అని అడిగాను. వాళ్లు మిమ్మల్ని గుర్తు పట్టి చూస్తున్నారు సర్ అని చెప్పాడు. ఆసమంలో నేను చాలా భయపడ్డాను” అని వర్మ వెల్లడించారు.


అంతకు ముందూ ఇలాగే..


అంతకు ముందు కూడా ఓసారి ఇలాంటి ఘటనే జరిగిందని చెప్పారు వర్మ. “నేను కారులో వెళ్తున్నాను. మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారని  డ్రైవర్ నాతో అన్నాడు. మన ఆఫీస్ బయట బైక్ కనిపించింది.  అదే బైక్ మీద ఓ యువకుడు మనల్ని ఫాలో అవుతూ వస్తున్నాడని చెప్పాడు. నేను కారు ఎటు మలిపినా తను మన కారు వెంటే వస్తున్నాడని చెప్పాడు. నేను కూడా చూశాను. పోలీస్ స్టేషన్ కు వెళ్లనా? అన్నాడు డ్రైవర్. వద్దు ఇంటికి వెళ్లు అని చెప్పాను. నేను ఇంటికెళ్లి కారు దిగాను. వాడు గేట్ దగ్గర ఆగాడు. నేను అతడి వైపు చూస్తూ ఏంటి? అని అడిగాను. వాడి దగ్గర ఓ బ్యాగ్ ఉంది. అందులో చేయి పెట్టాడు. మా డ్రైవర్ అరుస్తున్నాడు. నిజానికి అతడు ఓ రైటర్. బ్యాగులో స్ర్కిప్ట్ ఉంది. కానీ, ఆసమయంలో నాకు భయం అనిపించలేదు. ఈ విషయాన్ని మా ఫ్రెండ్ కు చెప్తే, లిఫ్ట్ రిపేర్ చేసే వాళ్ల కథ నీ సినిమా మాదిరిగా ఉంది. ఇది అలా లేదు. అందుకే భయపడలేదు అని చెప్పాడు” అన్నారు.  


Read Also: ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్ - డిఫరెంట్ లుక్‌తో పుష్పరాజ్ సర్ ప్రైజ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial