బాలీవుడ్ లో తన కంటూ ఓ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో సారా అలీఖాన్ ఒకరు. ఈమెకు దైవ భక్తి చాలా ఎక్కువ. తాజాగా ముంబయిలోని మహదేవ్ ఆలయానికి వెళ్లింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ముస్లిం మహిళవై ఉండి ఇలా చేస్తావా అంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్రోల్స్ పై సారా అలీ ఖాన్ ఘాటుగానే స్పందించింది. ‘‘నా జీవితం.. నా ఇష్టం’’ అంటూ ట్రోలర్స్ కు ఘాటుగా సమాధానమిచ్చింది.


స్టార్ హీరోలలో ఒకరైన సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైనా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ... తీరిక కుదిరినప్పుడల్లా ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటుంది. ఆమెకు శివుడంటే అమితమైన భక్తి. అందుకే అప్పుడప్పుడు అలా పుణ్య క్షేత్రాలను సందర్శించి, వాటికి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ పామ్స్ ద్వారా పంచుకుంటుంది. ఈ సమయంలోనే సారా అలీఖాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఆమె మహదేవ్ టెంపుల్ కి వెళ్లడమే. 


తన ఓన్ టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తన స్టార్ డమ్ ను నిలదొక్కుకుంటున్న సారా అలీ ఖాన్.. ఇటీవల తాను దర్శించుకున్న ముంబయిలోని ది ఫేమస్ మహదేవ్ టెంపుల్‌లో కూర్చొని పూజలు చేస్తున్న ఓ ఫొటోను పంచుకుంది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. తెగ ట్రోల్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నువ్వు అసలు ముస్లింవేనా అంటూ తిట్టిపోశారు. ఈ కామెంట్లపై ఇప్పటివరకూ ఆమె స్పందించలేదు. కానీ తాజాగా ఈ ట్రోలింగ్ పై రిప్లై ఇచ్చింది. 


సారా ఇటీవలే నటించిన సినిమా ‘గ్యాస్‌లైట్’. విక్రాంత్ మస్సే ప్రధాన పోత్ర పోషిస్తున్న  ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని స్వీడప్ చేసింది. అందులో భాగంగా రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సారా.. ఈ ట్రోలింగ్ చేసిన వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. తన నటనపై ప్రేక్షకులకు ఫిర్యాదులు ఉంటే యాక్సెప్ట్ చేస్తానని.. ఎందుకంటే తాను అభిమానుల కోసం నటిస్తానని చెప్పుకొచ్చింది. కాబట్టి అది తనకు కూడా సమస్య కావచ్చు అని తెలిపింది. కానీ తన వ్యక్తిగత విషయాలు లేదా తన జీవనశైలితో ఎవరికైనా సమస్య ఉంటే మాత్రం పట్టించుకోనని సారా గట్టిగా చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలోనే కాదు, హిందూ, ముస్లిం అని వేరు చేసి వాళ్లకూ ఇది మంచి సమాధానం అని పలువురు ఆమెకు మద్దతిస్తున్నారు. సెలబ్రెటీలన్నాక ట్రోల్స్, కామెంట్స్ సాధారణమే. ఇలా అందర్నీ పట్టించుకుంటూ పోతే జీవితంలో ఇంకేం చేయలేమని మరికొందరు అంటున్నారు. ఇక తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోన్న ఈ స్టార్‌ కిడ్‌.. ‘కేదార్‌నాథ్‌’, ‘సింబా’, ‘లవ్‌ ఆజ్‌కల్‌2’, ‘కూలీ నం.1’ చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ‘అత్రంగి రే’ అనే సినిమాలో నటిస్తోంది.


Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు