ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman)కు వేసవి వర్షాలు షాక్ ఇచ్చాయి. ఆయన అభిమానులను డిజప్పాయింట్ చేశాయి. అనూహ్యంగా మే నెలలో హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల ప్రభావం తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ మీద పడింది.

Continues below advertisement

'ఓజీ టూర్ ఇండియా విత్ తమన్' క్యాన్సిల్OG Tour India With Thaman: తమన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 'ఓజీ టూర్ ఇండియా విత్ తమన్' ప్లాన్ చేశారు. మొదటి లైవ్ షో హైదరాబాద్ సిటీలో ఇవాళ (జూన్ 13న) జరగాలి. హైదరాబాద్ వర్షాల వల్ల, అనుకోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రోజు జరగాల్సిన మ్యూజికల్ కాన్సర్ట్ క్యాన్సిల్ అయ్యింది.

Also Read: Disha Patani Success Story - బీటెక్ సెకండియర్‌లో కాలేజ్ మానేసి సినిమాల్లోకి... 500 నుంచి 5వేల కోట్లకు... దిశా పటాని సక్సెస్ వెనుక ఏం జరిగిందో తెలుసా?

Continues below advertisement

జూన్ 13వ తేదీ సాయంతం 6:30 గంటలకు హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో 'ఓజీ టూర్' (తమన్ మ్యూజికల్ కాన్సర్ట్) జరగాల్సి ఉంది. అయితే... హైదరాబాద్ సిటీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అది క్యాన్సిల్ అయ్యిందని తమన్ ట్వీట్ చేశారు. అలాగే, నిర్వాహకులు సైతం కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు వెల్లడించారు.

Also ReadPranit More 370 Biryani Row - 370 బిర్యానీ కాంట్రవర్సీ... మీరు తిట్టడంలో తప్పే లేదు... మరో ఛాన్స్ ప్లీజ్ - హిమాన్షు ఎపిసోడ్‌పై ప్రణీత్ మోరే వీడియో

ఓజీ టూర్ కోసం తన 56 మంది సభ్యుల బృందంతో కలిసి గత 45 రోజులుగా ఎంతో శ్రమించి ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేశారమని, అయితే దేవుడి ప్లాన్ వేరేగా ఉందని, వర్షాల కారణంగా కాన్సర్ట్ క్యాన్సిల్ కావడంతో హార్ట్ బ్రేక్ అయినంత పని అయ్యిందని 'ఎక్స్' (ట్విట్టర్)లో తమన్ పోస్ట్ చేశారు. ''నేను ఎప్పుడూ దేవుడు, విధిని నమ్ముతాను. ఇప్పుడు మీ అందరి ప్రేమ, నమ్మకం నాకు చాలా అవసరం. ఓజీ కాన్సర్ట్ ఏ విషయంలోనూ తక్కువ కాదని నేను నిరూపిస్తాను. నా కమ్‌బ్యాక్‌లు ఎప్పుడూ మరింత స్ట్రాంగ్‌గా ఉంటాయి" అని ఆయన పేర్కొన్నారు. జూన్ 13న 'ఓజీ టూర్' క్యాన్సిల్ అయినప్పటికీ... త్వరలో రీ షెడ్యూల్ చేయడానికి అవకాశాలను పరిశీలిస్తున్నామని తమన్ టీమ్ వెల్లడించింది. అది ఎప్పుడు? అనేది త్వరలో తెలుస్తుంది.

Also ReadSuriya - Prabhas: ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరూ సేమ్ మిస్టేక్ చేశారేంటి?