హిట్ అండ్ రన్... ఈ మాటలు వింటే బాలీవుడ్ ప్రేక్షకులు, తెలుగులోనూ కొంత మందికి సల్మాన్ ఖాన్ (Salman Khan) గుర్తుకు వస్తారు. సుమారు పాతికేళ్ల క్రితం ముంబైలో ఫుట్ పాత్ మీద నిద్రపోతున్న వాళ్ళపై నుంచి కారును పోనివ్వడంతో సల్మాన్ మీద 'హిట్ అండ్ రన్' కేసు నమోదైంది. ఆ కేసు నుంచి 2015లో ఆయనకు విముక్తి లభించింది. ఇప్పుడు 'హిట్ అండ్ రన్' టైటిల్‌తో బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా సినిమా ప్రకటించడంతో ఆ కేసు కొంత మందికి గుర్తుకు వస్తోంది.
'హిట్ అండ్ రన్'లో సంజయ్ రావ్Sanjay Rao Hit And Run Movie Update: సంజయ్ రావ్ హీరోగా రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ అండ్ రన్'. ఇందులో నటాషా సింగ్ హీరోయిన్. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్రియేషన్స్ సంస్థలపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాయి కృష్ణ సాగర్ దర్శకుడు.
సంజయ్ రావ్ పుట్టినరోజు సందర్భంగా మే 29న 'హిట్ అండ్ రన్' ఫస్ట్ లుక్‌ను శ్రీ విష్ణు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఆ లుక్ చూస్తే... చుట్టూ బ్లడ్, ఏదో ఆలోచనలో హీరో పడినట్టు అర్థం అవుతోంది. ఆయనకు గాయం కావడానికి కారణం ఎవరు? ఆ రక్తపు మరకల వెనుక ఎవరు ఉన్నారు? అనేది ఆసక్తికరం. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో 'హిట్ అండ్ రన్' టీజర్ విడుదల చేయనున్నారు. అది వచ్చాక సినిమాపై అందరికీ ఓ స్పష్టత వస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు.
Hit And Run Telugu Movie Cast Crew: సంజయ్ రావ్, నటాషా సింగ్ జంటగా నటిస్తున్న 'హిట్ అండ్ రన్'లో కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: ప్రిన్స్ హెన్రీ, ఛాయాగ్రహణం: విజయ్ భాస్కర్ సద్దాల - ఎల్ గంగాధర్, కూర్పు: డి వెంకట ప్రభు, నిర్మాణ సంస్థ: సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, నిర్మాతలు: సతీష్ రెడ్డి అల్లం - కె.శేఖర్, రచన & దర్శకత్వం: సాయి కృష్ణ సాగర్.
