Hey Balwanth Box Office Collection : సుహాస్ 'హే బల్‌వంత్' డీసెంట్ కలెక్షన్స్ - ఫస్ట్ డేతో పోలిస్తే...
Hey Balwanth Collection Day 2 : సుహాస్ లేటెస్ట్ కామెడీ డ్రామా 'హే బల్‌వంత్' కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.

Suhas's Hey Balwanth Movie Two Days Box Office Collections : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'హే బల్‌వంత్'. 'సుహాస్ 2.O' అంటూ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రెండు రోజుల్లో మంచి కలెక్షన్స్ అందుకుంది. మరి ఆ డీటెయిల్స్ ఓసారి చూస్తే...
2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మూవీ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.4.16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. లాఫ్ బస్టర్ ఎంటర్టైనర్ అంటూ సుహాస్ ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అటు, ఓవర్సీస్‌లో $171 డాలర్లకు పైగా వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇక వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ 3 రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని మూవీ టీం భావిస్తోంది. ఫస్ట్ డే 'హే బల్‌వంత్'కు రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సుహాస్ గత సినిమాలతో పోలిస్తే ఈ మూవీ కలెక్షన్స్ పరంగా మంచి విజయం సాధించిందనే చెప్పాలి.
View this post on Instagram
View this post on Instagram
Also Read : 'కోర్ట్' జంట ఎనర్జిటిక్ స్టెప్పులు - రాము రాథోడ్ వాయిస్... ట్రెండింగ్ లిరిక్స్ చూశారా?
ఈ మూవీకి గోపీ అచ్చర దర్శకత్వం వహించగా... సుహాస్, శివానీలతో పాటు సీనియర్ హీరో నరేశ్, సుదర్శన్, యాంకర్ స్రవంతి, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిశుల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి నరేంద్ర రెడ్డి నిర్మించగా... వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.
స్టోరీ ఏంటంటే?
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన కుర్రాడు కృష్ణ (సుహాస్)... నాన్న రావు బల్వంత్ (నరేష్), నాన్నమ్మ (అన్నపూర్ణమ్మ) సంరక్షణలో పెరుగుతాడు. తన తండ్రిని రోల్ మోడల్‌గా తీసుకున్న కృష్ణ.. చదువు పూర్తయ్యాక అతని బిజినెస్ టేకోవర్ చేసుకోవాలని అనుకుంటాడు. అయితే, ముందు నో చెప్పినా అనుకోని పరిస్థితుల్లో తండ్రి బిజినెస్ కొడుకు చేతిలోకి వెళ్తుంది. అప్పుడే తండ్రి బిజినెస్ గురించి ఓ షాకింగ్ నిజం బయటపడుతుంది.
దీంతో లైఫ్ ఒక్కసారిగా తలక్రిందులు అవుతుంది. ఆ బిజినెస్ కారణంగా కృష్ణ ఎంతో ప్రేమించిన మిత్ర (శివానీ నాగారం) కూడా దూరమవుతుంది. ఇంతకీ తండ్రి చేసిన బిజినెస్ ఏంటి? అక్కడికి వచ్చిన మిత్ర తాత ఎందుకు చనిపోయాడు? రావు బల్వంత్ బిజినెస్‌కు చంప (స్రవంతి)కి సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
























